అమెరికాలో శరత్ ని కాల్చి చంపింది వీడే… వీడియో రిలీజ్

americ-aఅమెరికాలోని కన్సాస్ లో శనివారం సాయంత్రం ఫ్రెండ్స్ తో కలసి రెస్టారెంట్ కు వెళ్లిన వరంగల్ విద్యార్ధి శరత్ కొప్పు(25) ను కాల్చి చంపిన నల్లజాతీయ వ్యక్తి ఇతడే అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు పోలీసులు. నిందితున్ని పట్టించినవారికి 10 వేల డాలర్ల బహుమతిని ప్రకటించారు. దీనికి సంబంధిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కన్సాస్ పోలీసులు. దోపిడీ క్రమంలోనే ఈ హత్య జరిగిందని, జాతి విద్వేష కోణంలో ఎలాంటి అనుమానాలు లేవని ఓ ఉన్నతాధికారి తెలిపారు. శరత్ మృతదేహాన్ని భారత్ కు రప్పించే ప్రత్నాలు జరుగుతున్నాయి. మూనివర్శిటీ ఆఫ్ మిస్సోరిలో శరత్ ఎమ్మెస్ చేస్తున్నాడు. 2018, జనవరిలో శరత్ ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy