అమెరికాలో ‘హెచ్‌ -1బీ’ ఉద్యోగులకు వేధింపులు

వాషింగ్టన్‍: అమెరికాలో హెచ్‌‌‌‌-1బీ వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులు దోపిడీకి గురవుతున్నారా? అక్కడ పని వాతావరణం చాలా దారుణంగా ఉంటోందా?ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నా రా? అంటే అవుననే అంటోంది సౌతాసియా సెంటర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ది అట్లాంటిక్‌ కౌన్సిల్‌‌‌‌(ఎస్‍ఏసీఏసీ)’ సంస్థ. ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

ఈ మేరకు పలు సిఫార్సులతో ఓ రిపోర్టు విడుదల చేసింది. ఉద్యోగ హక్కులు కల్పించాలి. ప్రస్తుత హెచ్‍1బీ వీసా వ్యవస్థ అమెరికన్లకు హానికరం. అలాగే హెచ్‍ 1బీ వీసాపై పని చేసే ఉద్యోగులు కూడా దోపిడీకి, వేధింపులకు గురవుతున్నారు. వారికి తక్కువ జీతాలు చెల్లిస్తున్నారు. సరైన పని వాతావరణం కల్పించట్లేదని ఎస్‍ఏసీఏసీ తెలిపింది. ఉద్యోగులకు సరైన పని వాతావరణం ఉండేలా చూసుకోవాలని, మరిన్ని ఉద్యోగ హక్కులు కల్పించాలని చెప్పింది. అప్పుడే వారి జీవితాలు మెరుగవుతాయని పేర్కొంది. ఈ రిపోర్టును హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన రోన్‍ హీరా, ఎస్‍ఏసీఏసీ హెడ్‍ భరత్‍ గోపాలస్వామి రూపొందించారు.

హెచ్‌‌‌‌1బీ వీసా నిబంధనలను త్వరలోనే మారుస్తామని, వీటిని మరింత సులువు చేస్తామని, పౌరసత్వం కచ్చితంగా ఇచ్చేలా చూస్తామని ఈ మధ్యనే అమెరికా ప్రెసిడెంట్‍ డొనాల్డ్ ట్రంప్‍ ప్రకటించిన విషయం తెలిసిందే. హెచ్‍1బీ ఉద్యోగుల జీతాలు, పరిస్థితు లను మెరుగుపరచాలంటూ అట్లాంటిక్‍ కౌన్సిల్‍ రిపోర్టు విడుదల చేయడం గమనార్హం. హెచ్‍1బీ వీసాదారుల్లో ఎక్కువ మంది ఇండియన్లు ఉన్నారు. మూడు సంస్కరణలు ఎస్‍ఏసీఏసీ మూడు సంస్కరణలు సూచించింది. ఉద్యోగులందరికీ వీటిని వర్తింపజేయాలని చెప్పింది.

హెచ్‍1బీ వర్కర్లకు జీతాలను పెంచాలి. ఉత్తమ, చురుకైన ఉద్యోగులను ఆహ్వానించాలని అమెరికా భావిస్తే.. నైపుణ్యానికి తగ్గట్లు గా వారికి భారీ స్థాయిలో జీతాలు చెల్లించాల్సిందే. అమెరికాకు చెందిన వర్కర్లను తరచూ నియమించుకుంటున్నామని, అర్హులకే ఉద్యోగాలిచ్చామని నిరూపించుకోవాలి. హెచ్‍1బీ వీసా విధానం అమలుకు సమర్థమైన ఎన్ఫోర్స్ మెంట్‍ మెకానిజం ఉండాలి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy