అమెరికా చేతిలో ఆధార్‌ సమాచారం

staueఎన్నో రహస్యాలను ఛేదించి వెలుగులోకి తెచ్చిన వికీలిక్స్‌ తాజాగా మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. భారత్‌-అమెరికా భాయి భాయీ అని ఇటు భారత ప్రధాని మోడీ, అటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్నా.. ఇది వాస్తవం కాదని వికీలిక్స్‌ తేల్చేసింది. అంతేకాదు భారతీయుల వ్యక్తిగత వివరాలను అమెరికా నిఘా సంస్థ తెలుసుకునే అవకాశం వుందని వికీలీక్స్‌ ఆధారాలతో సహా బయటపెట్టింది. దీనికి సంబంధించిన రిపోర్ట్‌ను తెలుపుతూ వరుస ట్వీట్లు చేసింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కిందకే వస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన రెండురోజుల్లోనే ఆధార్‌ గురించి వికీలీక్స్‌ ఈ ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన క్రాస్‌ మ్యాచ్‌ టెక్నాలజీ అనే సంస్థ ఆధార్‌ బయోమెట్రిక్‌కు సాఫ్ట్‌వేర్‌ను అందించింది. అదే సంస్థ రూపొందించిన ఒక సాఫ్ట్‌వేర్‌తో ఆధార్‌ డేటాను అమెరికా నిఘా విభాగం (అమెరికా సెంట్రల్‌ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ-CIA) తెలుసుకునే అవకాశం వుందంటూ వికీలీక్స్‌ స్పష్టం చేసింది.  ఇండియన్ల వ్యక్తిగత వివరాలన్నీ అమెరికా చేతుల్లో పడినట్లేనని వికీలీక్స్‌ తేల్చిచెబుతోంది. CIA ఇప్పటికే భారతీయుల ఆధార్‌ డేటాబేస్‌ను దొంగలించిందంటూ ఒక మేగజైన్‌ ఆర్టికల్‌ను కూడా ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఆధార్‌ డేటాను దొంగతనం చేసేందుకు CIA లో ఆఫీస్‌ ఆఫ్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ పేరిట ఒక ప్రత్యేక బ్రాంచ్‌ కూడా వుందని వికీలీక్స్‌ స్పష్టం చేస్తోంది.

అయితే భారత అధికారులు మాత్రం వికీలీక్స్‌ ప్రకటనను కొట్టిపారేస్తున్నారు. ఆధార్‌ డేటాబేస్‌ను అమెరికాకు చెందిన క్రాస్‌ మ్యాచ్‌ టెక్నాలజీ అనే సంస్థ చౌర్యం చేసే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు. బయోమెట్రిక్‌ వివరాలను సేకరించేందుకు వాడిన టూల్స్‌ను మాత్రమే ఈ సంస్థ ఇచ్చిందనీ.. వీటి ద్వారా డేటాను అమెరికాకు  చేరవేయలేరని చెబుతున్నారు. ఆధార్‌ డేటాను ఏ ఇతర సంస్థ యాక్సెస్‌ చేయలేదనీ, భారతీయుల వివరాలన్నీ భద్రంగా ఉన్నాయంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy