అమెరికా : తెలుగోళ్లపై కాల్పులు అడ్డుకుని హీరో అయ్యాడు

AMERICANఅమెరికాలోని కాన్సాస్‌లో చోటు చేసుకున్న జాత్యహంకార కాల్పుల్లో భారతీయ యువకుడిని కాపాడి హీరో అయ్యాడు ఓ అమెరికన్‌ పౌరుడు. కాల్పులకు కూడా భయపడకుండా దుండగుడిని కిందపడేసి బంధించే ప్రయత్నం చేశాడు. అతడి చేతులోని తుపాకీని లాక్కునే ప్రయత్నం చేశాడు. అప్పటికే అతడి తుపాకీ నుంచి తొమ్మిది బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆ తూటాల్లో రెండు అతడి శరీరంలోకి దూసుకెళ్లాయి. అందులో ఒకటి చాతీలోకి మరొకటి చేతిలోంచి దూసుకెళ్లాయి. అమెరికా నేవీలో పనిచేసిన మాజీ సైనికుడు అడామ్‌ పురింటన్‌ (51) ఆస్టిన్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌ లో ఇద్దరు తెలుగువారిపై కాల్పులు జరిపాడు. తమ దేశాన్ని విడిచి వెళ్లిపోండి అని గట్టిగా అరుస్తూ కాల్పులు కొనసాగించాడు. అదే సమయంలో అక్కడికి బీర్‌ తాగేందుకు వచ్చిన ఇయాన్‌ గ్రిలియట్‌(24) వెంటనే పురింటన్‌పైకి దూకాడు. అతడి తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు ట్రిగర్‌ నొక్కడంతో రెండు బుల్లెట్లు గ్రిలియట్‌ శరీరంలోకి దూసుకెళ్లాయి. అయినప్పటికీ అతడిపై వీరోచితంగా పోరాడి కిందపడేశాడు గ్రిలియట్‌. గాయాల కారణంగా గ్రిలియట్‌ స్పృహకోల్పోతుండగా పారిపోయాడు పురింటన్‌. ఐదు గంటల అనంతరం పోలీసులు దుండగుడిని అరెస్టు చేశారు. స్పృహకోల్పోయిన గ్రిలియట్‌ను ఆస్పత్రికి తరలించగా అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

వాస్తవానికి గ్రిలియట్‌ అడ్డుకోకుంటే తెలుగువాడు అలోక్‌ చనిపోయేవాడు. ‘అతడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అతడు ఏ జాతి వాడో కూడా తనకు తెలియదు. కానీ మనందరం మనుషులం. నేను బ్రతికి బయటపడటం నిజంగా అదృష్టమే. ఇది చాలా గొప్ప విషయం. ఆ ఘటనను నేను వర్ణించలేను. అలోక్‌ మాదసాని నిన్న నన్ను పరామర్శించి వెళ్లాడు. అతడి భార్య ఐదు నెలల గర్భవతి అని చెప్పాడు. అతడికి ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది’ అంటూ గ్రిలియట్‌ ఆస్పత్రిలో బెడ్‌పైనుండి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy