అమెరికా షట్ డౌన్ రికార్డు

వాషింగ్టన్: అమెరికాలో కొనసాగుతున్న ప్రభుత్వ షట్ డౌన్ ఆదివారంతో ఎక్కువకాలం పాటూ సాగిన షట్ డౌన్ గా చరిత్రలో నిలిచింది. మెక్సికో బోర్డర్ వాల్ విషయమై రేగిన వివాదంతో మొదలైన ప్రభుత్వ షట్ డౌన్ నేటితో 23 రోజులకు చేరింది. ఇటు ప్రభుత్వం , అటు ప్రతిపక్షాలు పట్టు విడవకపోవడంతో ఆర్థిక స్తంభన ఎంతకూ తొలగడంలేదు. గతంలో అత్యంత ఎక్కువ కాలం సాగిన షట్ డౌన్ల రికార్డులను మించి తాజా షట్డౌన్ కొనసాగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రెసిడెంట్ డొనాల్డ్ ​ట్రంప్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తొందరపడి ఎమర్జెన్సీ ప్రకటించడంవల్ల చట్టపరమైన చిక్కులు ఎదురవుతాయని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ స్తంభనతో దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలందడంలేదు.

గతంలో ఎప్పుడెప్పుడు..?

అమెరికా చరిత్రలోనే అతిపెద్ద షట్ డౌన్ బిల్ క్లింటన్ హయాంలో జరిగింది. 1995–96లో అప్పటి ప్రెసిడెంట్ క్లింటన్ నిర్ణయాలను రిపబ్లికన్లు తప్పుబట్టారు. విద్య, వైద్యం, ఎన్విరాన్మెంట్ పబ్లిక్ హెల్త్​కు సంబంధించి బడ్జెట్ కేటాయిం పులపై డెమోక్రాట్ ప్రెసిడెంట్ క్లింటన్, రిపబ్లికన్ల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు తీవ్రమయ్యాయి. రిపబ్లికన్లు సమర్పించిన స్పెండింగ్ బిల్లు ప్రతిపాదనలను క్లింటన్ తోసిపుచ్చారు. ఫలితంగా నిధులు విడుదల కాక ప్రభుత్వం షట్డౌన్ అయింది. షట్ డౌన్ ను ఎత్తేసేందుకు ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో 1995 డిసెంబర్ 16న అమెరికా ప్రభుత్వం ఆర్థికంగా స్తంభించిపోయింది. ఆ తర్వాతి ఏడాది జనవరి 6 వరకు ప్రభుత్వ కార్యకలాపాల్లో మెజారిటీ పనులపై షట్ డౌన్ ప్రభావం పడింది. ఈ పీడియడ్లో షట్ డౌన్ 21 రోజుల పాటు కొనసాగింది. 1978లో కార్టన్ ప్రెసిడెంట్ గా ఉండగా 17 రోజుల పాటు, ఒబామా టైమ్ లో 16 రోజుల పాటు షట్ డౌన్ కొనసాగింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy