అమెరికా సాక్షిగా రైతన్న కోసం

suicidesఅన్నదాతల మరణాలు అమెరికాలో ఉన్నవారిని కూడా కదిలిస్తున్నాయి. పదిమందికి తిండిపెట్టే రైతన్న ఇవాళ నిస్సహాయుడిగా… నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడటం అందరినీ కలిచివేస్తోంది. అన్నదాతల మరణాలపై స్పందించిన ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్… వారికి సంఘీభావంగా భారీ ప్రదర్శనకు పిలుపునిచ్చింది. ఈ నెల 19న ఫిలడెల్పియాలోని విల్సన్ ఫామ్ పార్క్ సమీపంలో ప్రదర్శన నిర్వహిస్తుంది. రైతులకు తామున్నామనే భరోసా ఇవ్వడానికే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు తెలిపారు సంస్థ నిర్వాహకులు. మరోవైపు అదేరోజు రైతు భరోసా, సంఘీభావ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది తెలంగాణ రైతు జేఏసీ. ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని.. ఎవరికి వారు తమకు తోచిన రీతిలో స్థానికంగా రైతు సంఘీభావ యాత్రలు, ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Support_Farmers_Rytu_JAC

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy