జయలలితకు తాత్కాలిక బెయిల్ ఇచ్చిన సుప్రీం

తమిళనాడు మాజీ సీఎం జయలలితకు బెయిల్ వచ్చింది. షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ ను మంజూరు  చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అనారోగ్య కారణాలతో డిసెంబర్ 18 వరకూ మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది సుప్రీంకోర్టు. బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ కర్నాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ జయ తరఫు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఇండియా టాప్ కోర్టు. జయతో పాటు ఇదే కేసులో అరస్టైన మిగతా ముగ్గురు నింధితులు శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు కూడా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 27 నుంచి జయలలిత జైల్లో ఉన్నారు. అమ్మకు బెయిల్ రావడంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అన్నాడీఎంకే ఫౌండేషన్ డే రోజునే జయకు బెయిల్ రావడంతో అభిమానుల సంబరాలకు అడ్డే లేకుండా పోయింది.

రెండు నెలలు ఇంట్లోనే ఉండనున్న జయ…

జయలలితకు బెయిల్ ఇచ్చినా..కండిషన్స్ అప్లై చేసింది సుప్రీంకోర్టు.రెండు నెలల్లోగా అన్ని వివరాలతో అప్పీలు చేసుకోవాలని జయకు సుప్రీం ఆదేశించింది. ఈ రెండు నెలలు తాను ఇంట్లోనే ఉంటారని జయ తరఫు లాయర్లు కోర్టుకు చెప్పారు. కర్నాటక హైకోర్టు శిక్షను రద్దు చేస్తేనే జయపై ఉన్న అనర్హత వేటు పోతుందని, అప్పటి వరకూ ఆమెపై అనర్హత వేటు ఉంటుందని లాయర్లు చెప్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy