అమ్మకు సాయం: బాలింతలకు రూ. 6000

babyబాలింతలకు రూ. 6వేల రూపాయల ఆర్థిక సాయమందించే ప్రసూతి ప్రయోజన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా గర్భిణిగా పేరు నమోదు చేసుకున్నాక తొలివిడతగా రూ.1000 లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుంది. గర్భం దాల్చిన ఆరు నెలల తర్వాత కనీసం ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాక మరో రూ.2000 జమ చేస్తారు. శిశువు పుట్టిన తర్వాత ఆ వివరాలు నమోదు చేయించి, తొలివిడత బీసీజీ, పోలియో వ్యాక్సిన్‌ (ఓపీవీ), డీపీటీ, హెపటైటిస్‌-బి వంటి టీకాలను శిశువుకు వేయించిన తర్వాత మిగిలిన రూ.2000 ఇస్తారు. ఆసుపత్రుల్లో పురుడు పోసుకున్నవారికి ప్రస్తుత మాతృత్వ లబ్ధి పథకాల ప్రకారం మిగిలిన రూ.1000 అందేలా చూస్తారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారు, ఇతరత్రా ఏదైనా చట్టాల ద్వారా ఇలాంటి లబ్ధి పొందుతున్నవారికి ఈ పథకం వర్తించదు. 2010 నుంచి దేశంలోని 56 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్‌ యోజన’ను దేశమంతటికీ విస్తరింపజేస్తామని గతేడాది డిసెంబరు 31న ప్రధాని ప్రకటించారు. ఆ పథకం కింద తొలి రెండు కాన్పులకు లబ్ధి వర్తిస్తుండగా కేబినెట్‌ నిర్ణయం మేరకు దానిని ఒక కాన్పు వరకే పరిమితం చేయడంతో ప్రభుత్వంపై భారం సగం తగ్గిపోనుంది. ఈ పథకం కింద 2017-18 బడ్జెట్లో కేటాయింపుల్ని రూ.2700 కోట్లకు పరిమితం చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy