అమ్మనే అంటారా.. ఇక కాస్కోండి : ఫిల్మ్ చాంబర్ లో పవన్ తో మెగా ఫ్యామిలీ భేటీ

pawan-film-chamberతల్లిపై దారుణమైన వ్యాఖ్యలు చేయించటం వెనక టీడీపీతోపాటు ఓ వర్గం మీడియా కుట్ర చేశాయంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి ట్విట్ల ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఇక లాభం లేదనుకున్న పవర్ స్టార్ ఏకంగా బరిలో దిగారు. ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ చాంబర్ కు వచ్చారు. లాయర్లతో మంతనాలు చేస్తున్నారు. న్యాయపరంగానే ఈ వివాదాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించారు. పవన్ కల్యాణ్ ఫిల్మ్ చాంబర్ కు వచ్చిన వెంటనే.. ఆయనకు మద్దతుగా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వచ్చారు. నాగబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు, నరేష్, మెహెర్ రమేష్, సాయి ధరమ్ తేజ్ కూడా పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఫిల్మ్ చాంబర్ కు వచ్చారు.

పవన్ కల్యాణ్ నల్ల చొక్కా ధరించి ఉండటంతో.. అమ్మపై వ్యాఖ్యలు చేయటానికి నిరసనగా ఒక రోజు దీక్షకు దిగే అవకాశం ఉందని జనసేన పార్టీ ప్రతినిధులు అంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy