అమ్మాయిల కోసం దొంగతనాలు

41444702477_625x300అమ్మాయిలు.. జల్సాలు.. ఇవే వాళ్ల ఇష్టాలు. లవర్ బోయ్ లా కనిపించాలి. అమ్మాయిలతో బైకులపై తిరగాలి.. సినిమాలు చూడాలి. పార్క్ లకు వెళ్లాలి. ఫుల్ జోష్ లో ముంచాలి. ఇవే వారి ఆనందాలు. వీటి కోసం ఏమైనా చేయడానికి వాళ్లు రెడీ అయ్యారు. ఆ ముగ్గురూ… దొంగతనాన్నే ప్రొఫెషన్ గా ఎంచుకున్నారు. బైక్ లు దొంగిలిస్తూ… చైన్ స్నాచింగ్ లు చేస్తూ.. గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేశారు. ఆటలన్నీ అన్ని  రోజులూ సాగుతాయా..? పోలీసులకూ ఓ రోజుంటుంది కదా.. అదిగో అక్కడే వీళ్లు అడ్డంగా దొరికిపోయారు. కరీంనగర్ పోలీసుల వలలో చిక్కుకున్నారు. ఈ ముగ్గురు జల్సా రాయుళ్ల నుంచి 32 తులాల బంగారం, 30 తులాల వెండి, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం…. కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం పాతదాంరాజ్ పల్లికి చెందిన పల్లెపు రాజేశ్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కూట్ కు చెందిన పల్లెపు రాజేశ్, రంగారెడ్డి జిల్లా సారంగాపూర్ మండలం గణేశ్ పల్లికి చెందిన సూరసాయిలు అలియాస్ శ్రీకాంత్ లు పేకాట ఫ్రెండ్స్. ఈ ముగ్గురికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉండటంతో…. వాళ్ల సంతోషాల కోసం… పేకాట ఫ్రెండ్స్ కాస్తా… దొంగతనాల్లో మరింత దగ్గరయ్యారు. అలా పేకల్లో మొదలైన స్నేహం మూడు బైకులు.. ఆరు చైన్ స్నాచింగులు వరకు వెళ్లింది. పక్కా ప్లాన్ తోనే దొంగతనాలు చేసేవారని వీరి గురించి వివరించారు కరీంనగర్ ఎస్సీ జోయల్ డేవీస్.

రాత్రి పూట కరీంనగర్ లో బైక్ లు దొంగతనం చేయడం… ఆ బైక్ లపై తిరుగుతూ రెక్కీ నిర్వహించడం… వాటితోనే దొంగతనాలు చేయడం.. ఇలా ఉండేది వీరి వర్కింగ్ స్టైల్. అంతేకాదు.. డౌట్ రాకుండా ఒక్కోసారి ఇద్దరూ.. మరోసారి ముగ్గురూ.. ఇంకో సారి ఒక్కరూ ఇలా రకారకాలుగా దొంగతనాలు చేసేవారు. ఆ రోజు దొంగతనం అయిపోగానే..  ఆ బైక్ ఎక్కడైనా ఒక చోట వదిలేసేవారు. ఇలా రోజురోజుకు వీరి ఆగడాలు ఎక్కువవుతుండటంతో వీళ్లపై గట్టి నిఘా పెట్టారు కరీంనగర్ పోలీసులు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 19 కేసులు నమోదయ్యాయి. దీంతో 15 టీమ్ లు వీరి కోసం వేట మొదలు పెట్టాయి. చెక్ పోస్టుల్లో తనిఖీలు పెంచారు. చివరికి గత నెలలో వేములవాడలో జరిగిన దొంగతనంపై సీరియస్ గా దృష్టి పెట్టడంతో చివరికి పోలీసులకు చిక్కారు ఈ ముగ్గురు మిత్రులు. దొంగలను పట్టుకోవడంలో కృషి చేసిన స్పెషల్ టీమ్స్ ను అభినందించారు ఎస్పీ జోయల్ డేవిస్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy