అమ్మాయిల సెల్ఫ్ డిఫెన్స్ కోసం ‘డేర్ గ్రూప్’ వర్క్ షాప్…

Screen Shot 2014-10-31 at 12.11.28 PMగడప దాటిన అమ్మాయి ఇంటికొచ్చే వరకూ టెన్షనే. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం పేరంట్స్ లో కనబడుతోంది. ఇలాంటి తల్లిదండ్రుల భయాన్ని పొగొట్టడానికి ఏర్పాటైందే  డేర్ గ్రూప్. అమ్మాయిలకు ఆత్మరక్షణపై వర్క్ షాపులు నిర్వహిస్తూ… వారిలో కాన్ఫిడెన్స్ పెంచుతోంది డేర్ గ్రూప్. సెల్ఫ్ డిఫెన్స్… అన్నింటికంటే ముఖ్యమైన ఆయుధం. ఈ ఆయుధాన్నే అమ్మాయిలకు ఇస్తామంటోంది. డిఫెన్స్ ఎగైనెస్ట్ రేప్ అండ్ ఈవ్ టీజింగ్… కాన్సెప్ట్ తో ఏర్పాటయ్యిందే డేర్ గ్రూప్. ఇంగ్లాండ్ లో స్థిరపడ్డ ఎన్నారై వామా… ఈ గ్రూప్ ను నిర్వహిస్తోంది. కాలేజీ విద్యార్థినులకు ఆత్మరక్షణలో శిక్షణ ఇస్తోంది ఈ గ్రూప్. 17 ఏళ్ల వామా ఇంటర్ చేసింది. ఈమె తల్లిదండ్రులది కర్నాటకలోని బళ్లారి. సెలవుల్లో ఇండియా వచ్చినప్పుడు నిర్భయ లాంటి ఘటనలను చూసి చలించిపోయింది. చదువును కాస్త పక్కన పెట్టి… ఇండియాలోనే ఉండటానికి నిర్ణయించుకుంది. మహిళలపై అత్యాచారాలను అరికట్టడానికి సెల్ఫ్ డిఫెన్స్ ఒకటే.. మార్గమని భావించిన వామా… మరికొందరితో కలిసి దేశవ్యాప్తంగా వర్క్ షాపులు నిర్వహిస్తోంది. ఈవ్ టీజింగ్ చేసే వారిని చూస్తూ ఊరుకోకూడదని… వారికి బుద్ధి చెప్పాలంటోంది వామా. ఏడాదిపాటు ఇండియాలోనే ఉండి వర్క్ షాపులు కొనసాగిస్తానంటోంది.  ఆమె టీం నిర్వహిస్తున్న అవగాహన సదస్సులతో ఆత్మవిశ్వాసం పెరుగుతోందంటున్నారు అమ్మాయిలు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy