అమ్మ ఉడతా.. నీకు భలే తెలివి

squirrels-111ఉడత.. ఉడత.. ఓచ్ అంటూ… సరదాగా పాటలు పాడుకుంటాం. అల్లాటప్పాగా చూసే ఆ చిరు జీవులకు ఓ అరుదైన గుణం ఉందట. జ్ఞాపకశక్తిలో ఎంతో మెరుగట ఉడతలు. సమస్యల పరిష్కారానికి ఇవి ఉపయోగించే పద్ధతులను జ్ఞాపకం పెట్టుకోవడంలో చాలా ముందుంటాయట. దాదాపు రెండేళ్ల వరకూ గుర్తు పెట్టుకోగలవని గుర్తించారు ఎక్స్‌టర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఐదు ఉడుతలపై నిర్వహించిన ఓ ప్రయోగం ద్వారా ఈ విషయం తెలిసిందంటున్నారు. ఎరగా ఉంచిన ఆహారాన్ని అందుకునేందుకు కొన్ని అడ్డంకులు సృష్టించిన శాస్త్రవేత్తలు.. ఉడుతలు ఆ అడ్డంకులను ఎలా అధిగమించాయో గమనించారు. మొదట్లో అవి 8 సెకన్ల సమయం తీసుకున్నా.. కొంతకాలం తర్వాత ఈ సమయం 2 సెకన్లకు తగ్గింది. దాదాపు 22 నెలల తర్వాత కొన్ని మార్పులతో ఇదే రకమైన ప్రయోగం చేసినప్పుడు ఆ ఉడుతలు ముందు కొంచెం తటపటాయించినా ఆ తర్వాత మూడు సెకన్ల వ్యవధిలో ఆహారాన్ని అందుకున్నాయని దీని ద్వారా అవి తమ పాత పద్ధతులను గుర్తుంచుకున్నట్లు అయిందని రాబర్ట్‌ వివరించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy