అమ్మ క్యాంటీన్లకు పెరిగిన ఆదరణ

malivu-vilai-unavagam2013 ఫిబ్రవరిలో అమ్మ క్యాంటీన్లు ప్రారంభం

అమ్మ క్యాంటీన్స్ . తమిళనాట వీటికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అతి తక్కువ ధరకే మూడు పూటలా పేదవాడి ఆకలి తీర్చే అన్నపూర్ణగా ఎంతో ఫేమస్ అయ్యాయి. దేశరాజధాని ఢిల్లీ వీధుల్లోనూ అమ్మ క్యాంటిన్ ఖ్యాతి విస్తరించింది. సంక్షేమ పథకాల అమలులో ముందుండే జయలలిత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్కీంను రన్ చేస్తున్నారు. తమిళనాడు ప్రారంభించిన అమ్మ క్యాంటీన్ల పథకం సూపర్ హిట్ అయ్యింది. క్వాలిటీ, క్వాంటిటీలో ఏ మాత్రం రాజీపడకుండా జయ సర్కార్ అమ్మ క్యాంటీన్లను నడపుతోంది. 2013 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ పథకం ఇప్పటికీ అంతే ప్రజాదరణతో కొనసాగుతోంది. చెన్నైలో 15 క్యాంటీన్లతో ప్రారంభమై ఇప్పుడు 252 కు చేరాయి. క్యాంటీన్ల స్కీమ్ ప్రారంభించి రెండేళ్ల యిన సందర్భంగా ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందన్నదానిపై అమ్మకాల వివరాలు ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు వరకు అమ్మ క్యాంటిన్లలో 24 కోట్ల లక్ష ఇడ్లీలు, 10 కోట్ల 31 రోటీలు, 9 కోట్ల 79 లక్షల ప్లేట్ల వెరైటీ రైస్ అమ్ముడైనట్టు రికార్ట్స్ చెబుతున్నాయి.

CB03-AMMA_1475436f252 కు చేరిన అమ్మ క్యాంటీన్లు

తమిళనాడులో 200 వార్డులు, 7 గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర అమ్మ క్యాంటిన్లు ఏర్పాటు చేశారు. 5 వేల స్వయం సహాయక బృందాల నుంచి 5వేల మంది మహిళలను ఈ క్యాంటిన్ల కోసం నియమించారు. వండటం, వడ్డింపు, క్యాంటీన్ల మేనేజ్ మెంట్ అంతా వారే చూసుకుంటారు. ప్రతిరోజు 3 లక్షల మంది ఆకలిని అమ్మ క్యాంటీన్లు తీరుస్తున్నాయి. డైలీ లేబర్స్, డ్రైవర్లు, వలస కూలీలు, ఆఫీసులకు వెళ్లేవాళ్లు ఈ క్యాంటీన్లకు రెగ్యులర్ కస్టమర్లు. ఇక్కడ రూపాయికే ఒక ఇడ్లీ, 5 రూపాయలకే పొంగల్, వెరైటీ రైస్, 3 రూపాయలకే రోటీ,దాల్ దొరుకుతాయి. ఇంత తక్కువ కాస్ట్ లో క్వాలీటీ ఫుడ్ దొరుకుతున్నందునే అమ్మ క్యాంటీన్లకు అంత క్రేజ్.

AMMA CANTINఖర్చుపెరిగినా తగ్గని జయసర్కారు

అయితే వీటి నిర్వహణ మాత్రం తమిళనాడు కార్పొరేషన్ కు తలకు మించిన భారంగా మారింది. ప్రతి ఏటా క్యాంటీన్ల నిర్వహణకు 90 కోట్ల రూపాయలను కార్పొరేషన్ అదనంగా ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ వీటిని సక్సస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. సమస్యలు ఎదురైనా సామాన్యుల కడుపు నింపడంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు జయసర్కార్

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy