అమ్మ పట్టాభిషేకానికి అంతా రెడీ..!

jayalalఅమ్మ… పట్టాభిషేకానికి అంతా రెడీ అయింది. 22న మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రిగా జయ ప్రమాణం చేస్తారని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం నాడు… AIADMK శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే జయలలితను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశం తర్వాత… రాజ్ భవన్ లో ఆమె ప్రమాణ స్వీకారం చేసే చాన్సుంది. సీఎం అయిన తర్వాత… 6 నెలల్లోగా జయలలిత ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. దీనికి కూడా గ్రౌండ్ ప్రిపేర్ అయింది. అమ్మ కోసం… తన MLA పదవినే త్యాగం చేశాడు వెట్రివేల్. ఉత్తర చెన్నైలోని రాధాకృష్ణనగర్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వెట్రివేల్… పదవికి రాజీనామా చేశారు. వెట్రివేల్ రాజీనామాను… అసెంబ్లీ స్పీకర్ ధన్ పాల్ ఆమోదించారు. అయితే తానెందుకు రాజీనామా చేశాడో.. వెట్రివేల్ చెప్పకపోయినా… జయ కోసమే సీటును వదులుకున్నాడని… తమిళనాడు రాజకీయవర్గాలంటున్నాయి.

2011 ఎన్నికల్లో శ్రీరంగం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు జయలలిత. అయితే గతేడాది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో సీఎం పదవితో పాటు ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోయారు. కర్ణాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా ప్రకటించడంతో ఆమె మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టేందుకు రూట్ క్లియర్ అయింది. రాధాకృష్ణ నగర్ నుంచే ఆమె పోటీచేస్తారని తెలుస్తోంది. అయితే అన్నాడీఎంకే వర్గాలు మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వడంలేదు. 22న జరిగే అన్నాడీఎంకే శాసనసభా పక్ష సమావేశంలో… జయ తన నిర్ణయం ప్రకటిస్తారని చెబుతున్నారు. ఒకవేళ రాధాకృష్ణనగర్ నుంచి అమ్మ పోటీ చేస్తే రికార్డ్ బ్రేకింగ్ విక్టరీ కొడతారని పార్టీ వర్గాలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy