అమ్మ పాదాలకు వందనం.. ఓ ప్రిన్సిపల్ అద్భుత ఆలోచన

motherవిద్యార్థులకు తల్లి గొప్పతనాన్ని తెలియజేయాలనుకున్నారు ఆ కాలేజ్ ప్రిన్సిపాల్. ఆలోచన వచ్చిందే తడవుగా.. ఆచరణలో పెట్టారు. విద్యార్థులతో వారి తల్లుల పాదాలు కడిగించి పాదాభివందనం చేయించారు. మొత్తం 400 మంది విద్యార్థులు ఈ ఘటనలో పాల్గొన్నారు. అంతేకాదు అమ్మకు ఏ కష్టం రాకుండా జీవితాంతం చూసుకుంటామని వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ అరుదైన ఘటన మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగింది. ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ హన్మంతు సంకల్పంతో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy