అమ్మ బాబోయ్ : నిప్పుల కొలిమి

summerఎండలు మరింత ముదిరాయి. వడగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో పగటిపూట అగ్నిగుండంలా మారింది. ఇంట్లోంచి కాలు బయట పెడితే నిప్పుల కొలిమిలోకి అడుగుపెడుతున్నట్లుగా పరిస్థితి మారింది. బయట నిలిపిన వాహనాలను ముట్టుకుంటే చురుక్కుమంటున్నాయి. ఏసీ వాహనాల్లో బయటకెళ్లినా అధిక ఉష్ణోగ్రతలతో చమటలు పడుతున్న పరిస్థితి. ఇంతగా ఎండ తీవ్రత సిటీవాసులను భయపెడుతోంది. ఆకాశంలో ఎలాంటి మబ్బులు లేకపోవడం, భానుడి కిరణాలు తొంభై డిగ్రీల కోణంలో నిటారుగా భూమికి తాకుతుండటంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. గురువారం నగరంలో అత్యధికంగా 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైంది.

ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో మండుతున్న ఎండలకు, తీవ్రంగా వీస్తున్న వడగాలులకు ప్రజలు బేంబేలేత్తున్నారు. ఆ జిల్లాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఈ జిల్లాల్లో గురువారం 45 డీగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కోల్ బెల్ట్ ఏరియాలో నిప్పుల వర్షం కురుస్తోంది. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లి, భూపాలపల్లి, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, రామక్రిష్ణాపూర్ లు నిప్పుల కుంపటిలా మారాయి. ఆ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ కాస్ట్ గనులు గత కొద్ది రోజుల నుంచి రావణకాష్ఠంలా మండుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఫ్యాన్ల నుంచి, కూలర్ల నుంచి వేడి గాలులొస్తున్నాయి. ఏసీలు పని చేయడం లేదు. ఈ ప్రాంతాల్లో రమారమి 50 డీగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదై ఉండవచ్చని ప్రజలు భావిస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy