అమ్మ మళ్లీ సీఎం అయింది..!!

jayaతమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం

జయతో ప్రమాణం చేయించిన గవర్నర్ రోశయ్య

ఐదోసారి తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన జయలలిత

తరలొచ్చిన తమిళ సినీ లోకం..రజినీ, ఇళయరాజా, శరత్ కుమార్ హాజరు

అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరోసారి తమిళనాడు సీఎంగా ప్రమాణం చేశారు.మద్రాస్ వర్సిటీ ఆడిటోరియంలో జయతో ప్రమాణం చేయించారు గవర్నర్ రోశయ్య. దీంతో ఐదోసారి తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు అమ్మ. ఆ తర్వాత ఆర్ధిక మంత్రిగా పన్నీర్ సెల్వం, విద్యుత్ మంత్రిగా నాథమ్ ఆర్ విశ్వనాథన్, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఆర్. వైదిలింగం ప్రమాణం చేశారు. అయితే కీలకమైన హోం, పోలీసు, పబ్లిక్, ఆల్ ఇండియా సర్వీసెస్ వంటి శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు జయలలిత.

జయ ప్రమాణ స్వీకారంతో తమిళనాడులో పండగ వాతావరణం నెలకొంది. అమ్మ ప్రమాణానికి పలువురు సీని, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, నటుడు శరత్ కుమార్, ఇళయరాజా, శ్రీనివాసన్ తోపాటు..అన్నా డీఎంకే నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు ఆడిటోరియంలో అమ్మ ప్రమాణ స్వీకారం చేస్తుండగా..సెంటినరీ హాల్ బయట కార్యకర్తలు పటాకులు కాల్చుతూ సంబురాలు జరుపుకున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy