అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు చెప్పినవన్నీఅబద్ధాలే

Jayalalitha-karnataka-shashikalaచనిపోవడానికి ముందు జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో… అప్పటి మంత్రులు చెప్పినవన్నీ అబద్ధాలేనన్నారు తమిళనాడు అటవీ శాఖ మంత్రి దుండిగల్ శ్రీనివాసన్. అపోలో ఆస్పత్రిలో శశికళ తప్ప… జయలలితను ఎవరూ చూడలేదన్నారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, బీజేపీ చీఫ్ అమిత్ షా, గవర్నర్ విద్యాసాగర్ రావు, రాహుల్ గాంధీ సహా డీఎంకే నేతలు ఆస్పత్రికి వచ్చినా…  శశికళ, అపోలో ప్రతాప్ రెడ్డిని మాత్రమే కలిశారన్నారు.

అబద్ధాలు చెప్పి మభ్యపెట్టించినందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు తమను క్షమించాలని కోరారు దుండిగల్ శ్రీనివాసన్. శశికళ ఒత్తిడితో, ఆమెకు భయపడే…. జనాన్ని, కార్యకర్తలని నమ్మించేందుకు జయ ఇడ్లీ తింటున్నారని కొన్నిసార్లు.. కోలుకుంటున్నారని ఇంకొన్నిసార్లు అబద్ధాలు చెప్పామన్నారు. జయలలిత చనిపోవడానికి శశికళ, ఆమె కుటుంబ సభ్యులే కారణమన్నారు శ్రీనివాసన్. మధురైలో ఓ బహిరంగ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు.

శ్రీనివాసన్ కామెంట్స్ పై డీఎంకే స్పందించింది. జయ మరణం మీద ఎంక్వైరీ కమిషన్ తో దర్యాప్తు జరిపిస్తామని సీఎం పళనిసామి ప్రకటించినా… ఇప్పటికీ అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. జయ మృతి వెనుక ఉన్న అన్ని రహస్యాలను బయటపెట్టాలన్నారు డీఎంకే నేతలు.

జయ మృతిమీద ఎంక్వైరీ జరిపిస్తే అన్ని విషయాలు బయటపడతాయన్నారు శశికళ వర్గం నేత దినకరన్.  అపోలో ఆస్పత్రిలో జయ ట్రీట్ మెంట్ కు సంబంధించిన వీడియో ఫుటేజ్ తమ దగ్గర ఉందన్నారు. సమయం వచ్చినప్పుడు దాన్ని బయటపెడతామన్నారు దినకరన్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy