అయిదు షోల‌కు అజ్ఞాత‌వాసి కి అనుమ‌తి

agnyatavaasiప్రీమియ‌ర్ షోల‌కు అనుమ‌తి నిరాక‌రించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… అయిదు షోలు ప్ర‌ద‌ర్శించుకునేందుకు అజ్ఞాత‌వాసి నిర్మాణ సంస్థ‌కు పర్మిషన్ ఇచ్చింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో పవన్‌కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా రేపు(బుధవారం,జనవరి-10) రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే అజ్ఞాతవాసి సినిమాకు 10వ తేది నుంచి 17 వ తేది వ‌ర‌కూ ఈ అయిదు షోల‌కు అనుమ‌తి ఇస్తూ జివోను జారీ చేసింది. హైద‌రాబాద్ లో స‌హా తెలంగాణ‌లోని అన్ని థియేట‌ర్ల‌లో ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కే ఒక షో వేసుకునే వెసులుబాటు క‌లిగింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు(మంగళవారం,జనవరి-9) అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఒంటి గంట నుంచి అజ్ఞాత‌వాసి ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. 10వ తేది నుంచి 17వ తేది వ‌ర‌కూ ఏడు షోలు ప్ర‌ద‌ర్శించేంకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఈ మూవీకి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైరెక్టర్. కీర్తీ సురేష్, అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్స్ గా.. అనిరుథ్ సంగీతం స‌మ‌కూర్చిన ఈ మూవీ బుధవారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy