అయుతం మరో బ్రహ్మోత్సవం

ayuta gaamఅయుత చండీ మహా యాగం కీలక ఘట్టానికి చేరుకోవడంతో ఎర్రవెల్లి యాగ ప్రాంగణం.. భక్త జన సందోహంతో కళకళలాడుతోంది. మూడోరోజు శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. దీంతో యాగశాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఖాకీలు.

ప్రజా సంక్షేమం, రాష్ట్రా అభివృద్దికోసం సీఎం కేసీఆర్ చేపట్టిన మహా చండీ యాగం వైభవంగా జరుగుతోంది. యాగం మూడోరోజు ఉదయం గురుప్రార్ధన, గోపూజా,ఏకాదశ న్యాససపూర్వక త్రి సహస్ర చండీ పారాయణం. నవావరణపూజ… నవగ్రహ హోమాలు, యోగినీబలి,చతుర్వేద హహా రుద్ర పురచ్చరణ. మహాసౌరం, కుమారీపూజ, సుహాసినీ పూజ, దంపతి పూజలు జరగనున్నాయి.  ఇక సాయంత్రం ధార్మిక ప్రవచనం,కోటి నవాక్షరీ జపం, పార్ధివలింగ పూజ, అష్టావదాన సేవలు జరగననున్నాయి.

ఇక సప్తశతీ పారాయణ ఘోష మధ్య.. రెండో  రోజూ అయుత చండీ యాగం శాస్త్రోక్తంగా జరిగింది. తొలి రోజు పసుపు వస్త్రాల్లో యాగం నిర్వహించిన రుత్వికులు, యాగ కర్తలు… రెండో రోజు గులాబీ వస్త్రాలు ధరించి క్రతువు కొనసాగించారు. శృంగేరి భావి పీఠాధిపతి విదుశేఖర మహా స్వామి హాజరై  ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులను ఆశీర్వదించారు. ఉదయం 7 గంటలకు మొదలైన యాగం… రాత్రి వరకూ కొనసాగింది. జపాలు, హోమాలతో… యాగశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

గురుప్రార్థనతో మొదలైన రెండో రోజు యాగంలో… గణపతి పూజ, గో పూజ, ఏకాదశ న్యాస పూర్వక ద్వి సహస్ర చండీ పారాయణాలు జరిగాయి. వీటితో పాటు… నవావరణ పూజ.. యోగినీ బలి.. మహా ధన్వంతరీ యాగం.. రాజశ్యామల యాగం.. చతుర్వేద మహారుద్ర పునశ్చరణ.. మహాశౌరాన్ని పండితులు వైభవంగా నిర్వహించారు. ఉక్తదేవతా జపాలు.. కుమారి.. సువాసినీ… మహా మంగళహారతి కార్యక్రమాలు పూర్తి చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ధార్మిక ప్రవచనాలు.. సాయంత్రం కోటి నవాక్షరీ పురశ్చరణ.. ఉపచార పూజ.. విశేష నమస్కారాలు చేశారు. శ్రీ చక్ర మండలారాధనం.. అష్టావధాన సేవ.. ప్రసాద వినియోగం తర్వాత… రాత్రి శ్రీ రామలీల హరికథా కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మికత పెంచింది.

రెండోరోజు శృంగేరి భావి పీఠాధిపతి విదుశేఖర భారతీ మహాస్వామి తో పాటు స్వామీజీలు… యాగకర్త అయిన సీఎం కేసీఆర్ కు ఆశీస్సులు అందించారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు తో పాటు…. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మలు యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. . మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మరోవైపు యాగాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న భక్తులకు భోజన సదుపాయం కల్పించారు నిర్వాహకులు. రద్దీ ఎక్కువగా ఉండటంతో యాగశాల దగ్గర సెక్యురిటీని టైట్ చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy