అయుతం ముగింపు ఇవాళే

chandi-yagamఐదు రోజుల వైభవం. యజ్ఞాలు… యాగాలు. వేద ఘోషతో ఎర్రవల్లి ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. వీవీఐపీల ప్రత్యేక పూజలు… పండితుల ఆశీర్వచనాలతో అయుత మహా చండీయాగం కొనసాగుతోంది. ఇవాల్టి పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం క్రతువు ముగియనుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పూర్ణాహుతికి అటెండ్ కానున్నారు.

మెదక్ జిల్లా ఎర్రవల్లిలో సీఎం చేస్తున్న అయుత మహా చండీయాగం ఆఖరి ఘట్టానికి చేరింది. ఇవాళ నిర్వహించే పూర్ణాహుతితో యాగం పూర్తవనుంది. 15 వందలమంది రుత్విజులు పూర్ణాహుతిలో పాల్గొననున్నారు యాగం చివరి రోజు యాగం చేసిన చోట సీఎం దంపతులు నిద్రించనున్నారు. ఇక ఇవాల్టి కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విశిష్ట అతిధిగా అటెండవుతున్నారు. ప్రణబ్ తో పాటు గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు కార్యక్రమానికి హాజరుకానున్నారు. మధ్యాహ్నం ఒకటి నుంచి ఒకటిన్నర మధ్యలో రాష్ట్రపతి ప్రణబ్ యాగస్థలికి చేరుకోనున్నారు. 2.30 నుంచి జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనున్నారు.

సెలవు రోజులు కావడంతో ఎర్రవల్లి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. అదనంగా మరో రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అనుకున్న దానికంటే ఎక్కువ మంది భక్తులు వస్తుండడంతో భోజన దగ్గర కూడా పరిస్థితి ఇబ్బందిగా మారింది.

నాలుగోరోజూ అయుతం అద్భుతం

నాలుగోరోజు అంతా ఎర్రటి వస్ర్తాలు ధరించారు. యాగానికి వచ్చిన అతిధులకు వీటితోనే సన్మానించారు ముఖ్యమంత్రి. నిన్న ఆరుగురు పీఠాధిపతులు,స్వామీజీలు యాగస్థలికి వచ్చారు. వీరంతా సీఎం దంపతులకు ఆశీస్సులు అందించారు. వేదవిద్యాభివృద్ధికి కృషి చేస్తున్న మాడుగుల మాణిక్య సోమయాజులు దంపతులను సీఎం సన్మానించారు. స్వర్ణకంకణం తొడిగి సత్కరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా మృదంగ విద్వాంసుడు యెల్లా వెంకటేశ్వరరావు అందరినీ అలరించారు.  యాగం చివరి రోజు, అందులోనూ రాష్ట్రపతి అటెండ్ అవుతుండడంతో ఎర్రవల్లిలో పోలీసులు అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. జనం రద్దీ కూడా పెరిగే చాన్సు ఉండడంతో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే యాగశాలలోకి అనుమతిస్తున్నారు. పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగియనుండడంతో రేపు ఉదయం వేములవాడ వెళ్లి రాజరాజేశ్వరీదేవిని దర్శించుకోనున్నారు సీఎం దంపతులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy