అయుతం.. లక్షల చండీయాగాల సమానం

Yagna-or-Yajnaకోటి యజ్ఞాల ఫలం…ఒక చండీయాగం. లక్షల చండీయాగాలతో సమానం…అయుత చండీ యాగం. అయుత చండీయాగం చేస్తే… లక్షల కోట్ల యజ్ఞాలు పూర్తి చేసినట్టే. అంటే లక్షల కోట్ల యజ్ఞాలు ఎంత ఫలితానిస్తాయో…అంతే ఫలితాన్ని ఒక అయుత చండీయాగం ఇస్తుంది. ఈ యాగాన్నే శతసహస్ర చండీయాగం అని కూడా పిలుస్తారు. ఈ అయుత యాగం ఎక్కడ నిర్వహిస్తారో…అక్కడ సస్యశ్యామలమవుతోంది. ఈ మహా యజ్ఞం…ఎక్కడ పూర్తి చేస్తారో…అక్కడ సుఖశాంతులు విరాజిల్లుతాయి. ఈ యాగాన్ని ఇపుడు దేశ, రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం… ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టారు. ఇప్పటివరకూ శృంగేరి పీఠం వారు తప్ప.. ఎవరూ చేయని ఈ మహా యజ్ఞాన్ని ఆయన ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నారు.

లోక కల్యాణార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న మహా క్రతువు ప్రారంభమైంది. భారీ యాగశాలలు, హోమ గుండాలు, భోజన వసతులు, రుత్వికుల కుటీరాలు, వీఐపీల వసతి గదులు, ప్రజలు తిలకించేందుకు వీలుగా…అన్ని రకాల సదుపాయాలు అక్కడ సమకూర్చారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా… ఈ క్షేత్రం సిద్దమైంది. రుత్వికులతో పాటు ఎంతో మంది ప్రముఖులు, ప్రజలు ఈ యాగానికి హాజరవుతున్నారు. శైవ సంప్రదాయంతో ఈ యాగం ఐదు రోజులు పాటు జరుగుతుంది.

పరమం పవిత్రం అయుత చండీయాగం

CHANDIYAGAM3అయుత చండీ యాగం..చాలా పవిత్రమైన…శక్తివంతమైన యాగం. ఇందులో పాల్గొనేవారే కాదు… దగ్గరుండి తిలకించాలనుకునేవారుకూడా మనసును చాలా పవిత్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అదేవిదంగా దీక్ష వస్త్రాలు ధరించిన వారే యాగశాలలోకి ప్రవేశించడానికి అర్హులు. మిగతావారు బారికేడ్ల వద్ద నుంచి చూసి వెళ్లొచ్చు. యాగం జరిగే రోజుల్లో హరికథలు, వాగ్గేయకారుల గీతాలు, భజనలు ఉన్నాయి. యాగం తొలి రోజు.. బెంగళూరు నుంచి ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ వస్తున్నారు. వీరితో పాటు చినజీయర్ స్వామి, మాధవానందస్వామి, స్వరూపానంద స్వామి, మంత్రాలయం, శ్రీ పీఠం పీఠాధిపతులు కూడా హాజరవుతున్నారు.

విశ్వశాంతే లక్ష్యంగా మహాయజ్ఞం

విశ్వశాంతిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన అయుత చండీయాగం..ఇప్పటివరకూ నిర్వహించలేదు. ఎందుకంటే ఈ యాగం చేయాలంటే.. నియమాలు ఉండాలి. నిష్టగా వ్యవహరించాలి. రుత్వికులు చేయించే అన్ని యజ్ఞాలను దగ్గరుండి చేయాలి. ఎటువంటి ఆటంకం..ఈ యాగంలో కలగకూడదు. అలా అయితేనే అనుకున్నది సాధించగలుగుతారు.

యాగం.. యజ్ఞం .. రెండూ ఒక్కటే. ఇది ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణ కాలం నుంచి రకరకాల యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించడానికి చేసేదే ఈ మహా యాగం. వేదకాలం నుంచి భారతావనిలో స్వయంగా మహర్షులు, చక్రవర్తులు, మానవుడిగా అవతరించిన పంరంధాముడు… ఈ యాగాన్ని పూర్తి చేశారు. సాధారణంగా యజ్ఞాలు మూడు రకాలు. అవి.. పాక యజ్ఞం, అవిహవిర్యజ్ఞం, సోమ యజ్ఞం.

విశ్వశాంతి.. ప్రజా క్షేమం కోసమే సీఎమ్ కేసీఆర్… ఏర్పాటు చేసిన ఈ అయుత మహా యాగానికి సమారు 6 నుండి 7 కోట్ల రూపాయల వరకూ వెచ్చించనున్నారు. ఈ మొత్తాన్నంతా..ముఖ్యమంత్రే స్వయంగా భరిస్తానని చెప్పారు. ప్రజల శ్రేయస్సు…దేశ క్షేమం…ఇపుడు ఈ మహా క్రతువుల వల్లే సాధ్యం. అందుకే… కాలుష్యం, కరవుల వంటి విపత్తర పరిస్థితుల నుంచి ప్రజలను బయటపడేయాలంటే…ఇలాంటి మహా యాగాలు జరగాలి. 5 రోజుల ఈ అయుత మహా యాగం…ఆనందకరంగా పూర్తి కావాలని అందరం… ఆశిద్దాం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy