‘అయుతం’ 2014లో కూడా జరిగింది

Sadguru Paripoornananda Saraswati Swamiసీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ఇంత ఘనంగా యాగం చేయడం.. 200 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని… ఇదే మొదటిసారి అని కూడా అంటున్నారు. దీంతో భక్తజనం భక్తిశ్రద్ధలతో అయుత చండీయాగాన్ని చూస్తున్నారు. ఎర్రవల్లి వేదికగా జరుగుతున్న పూజలు, మంత్రోచ్ఛరణలను ఆసక్తిగా గమనిస్తున్నారంతా. అయితే గతేడాది ఫిబ్రవరిలోనూ అయుత చండీయాగం చేశారు రుత్విజులు. దాని విశేషాలేంటో చూద్దాం.

కలియుగంలో గణపతి, చండీ, తిరుమల వెంకన్న ఆరాధన విశేష ఫలితాలిస్తుందని భక్తుల నమ్మకం. చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత చండీయాగం, లక్ష చండీ యాగం అని చాలా రకాలున్నాయి. ఎన్నిరకాలున్నా చండీయాగం అత్యంత పవిత్రం…. పరిపూర్ణం అంటారు. ఆ యాగంలో పాల్గొన్నా.. ఆ పరిసరాల గాలి పీల్చినా చాలని భక్తుల విశ్వాసం. అలాంటి పవిత్రయాగం ఎర్రవల్లి జరుగుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపైనే.

రాజకీయ నేతగా స్వయంగా కేసీఆర్ చండీయాగం చేస్తుండటంతో.. దేశవ్యాప్తంగా అయుత చండీయాగం హాట్ టాపిక్ అయ్యింది. అయితే గతేడాది ఫిబ్రవరిలో స్వామి పరిపూర్ణానంద అధ్వర్యంలో అతిరుద్ర సహిత అయుత చండీయాగం జరిగింది. అదీ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో…. ఫిబ్రవరి 12 నుంచి 24 వరకు మొత్తం 12 రోజుల పాటు జరిగిందా యాగం.

అతిరుద్ర సహిత చండీయాగంలో 144 మంది రుత్వికులు పాల్గొన్నారు. రుద్రమంటపంలో 12 మంది చొప్పున 12 వేదికలను ఏర్పాటుచేసి.. రోజుకు 11 పారాయణాల చొప్పున… 12 రోజుల్లో 19 వేల 8 రుద్రపారాయణాలు నిర్వహించారు. అలాగే ప్రతీరోజూ పరిపూర్ణానంద స్వామివారితో లలితా సహస్ర నామంపై ప్రవచనం, వేదమూర్తులకు సత్కారం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. గతేడాది జరిగిన ఈ యాగం.. జనానికి పెద్దగా తెలియపోయినా.. సమాజ హితం కోసం చేశారు స్వామి పరిపూర్ణానంద.స్వాములు చేసిన దానికి… పాలకులు చేసిన దానికి తేడా ఉంటుంది కదా.. చరిత్రలో ఎంతమంది రుషీశ్వరులున్నా.. ధర్మరాజు లాంటి చక్రవర్తులు చేసిన అశ్వమేథ యాగమే అందరికీ గుర్తుంటుంది కదా అంటున్నారు కొందరు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy