అయుత చండీ మహాయాగానికి సర్వం సిద్ధం

kcr3అయుత చండీయాగంతో మెదక్ జిల్లా ఎర్రవల్లి సీఎం వ్యవసాయ క్షేత్రం ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. యాగశాలలో ఇవాళ గౌరీయాగం చేశారు సీఎం కేసీఆర్ దంపతులు. ముందుగా శివపార్వతుల విగ్రహం దగ్గర జ్యోతి ప్రజ్వలన చేసి… యాగం నిర్విఘ్నంగా కొనసాగేందుకు మహా గణపతి పూజ చేశారు. తర్వాత త్రైలోక్య మోహన గౌరీ హోమంలో పాల్గొన్నారు. పదివేల సార్లు గౌరీ జపం చేశారు సీఎం దంపతులు. వెయ్యి హోమాలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలతో యాగశాల మార్మోగింది. 40 ఎకరాల్లో జరుగుతోన్న మహా చండీయాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

kcr4రేపు ఉదయం 8గంటల 10నిమిషాలకు చండీయాగం ప్రారంభం కానుంది. శృంగేరీ జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. భారీ యాగశాలలు, హోమ గుండాలు, రుత్విక్కుల కుటీరాలు, VVIP ల గెస్ట్ హౌస్ లు స్వాగత తోరణాలతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం అందంగా ముస్తాబైంది. యాగానికి మొత్తం 101 హోమ గుండాలు సిద్ధం చేశారు.  హోమ చండీ, జప చండీ, తర్పణ చండీ, రుద్ర చండీ యాగాలు నిర్వహిస్తారు. నాలుగు రాష్ట్రాలకు చెందిన 15 వందల మంది రుత్విక్కులు ఈ యాగాల్లో పాల్గొంటారు.

యాగానికి వచ్చే ప్రముఖుల కోసం వ్యవసాయ క్షేత్రం సమీపంలోని వెంకటాపూర్ లో 4 హెలిప్యాడ్ లు సిద్ధం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, సీఎంల కోసం వేర్వేరుగా వీటిని ఏర్పాటు చేశారు. మొత్తం 8 చోట్ల పార్కింగ్ ప్లేసులు నిర్మించారు.  VIP లకు పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో ఉండగా… నర్సన్నపేట సమీపంలో మరో రెండు చోట్ల పార్కింగ్ ప్లేసులు రెడీ చేశారు. యాగానికి వెళ్ళే భక్తులకు బస్సు ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. భక్తులకు ఐదెకరాల స్థలంలో భోజనశాల సిద్ధం చేశారు.

kcr2యగానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ సహా చాలామంది వీవీఐపీలు వస్తుండటంతో  ముందు నుంచే సెక్యూరిటీని టైట్ చేశారు పోలీసులు. ఎర్రవల్లికి ఐదు కిలోమీటర్ల దూరం నుంచే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరినీ తనిఖీ చేశాకే చండీయాగానికి అనుమతించనున్నారు. 5వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy