అయుత మహాచండీ యాగం ప్రారంభం

CHANDIYAGAM7 CHANDIYAGAM6 CHANDIYAGAM5 CHANDIYAGAM3 CHANDIYAGAM2 CHANDIYAGAM1 CHANDIYAGAMఅయుత మహా చండీయాగంతో మెదక్ జిల్లా ఎర్రవల్లి సీఎం వ్యవసాయ క్షేత్రం ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. ఎక్కడ చూసినా వేద మంత్ర ఘోష వినపడుతోంది. వేద మంత్రాలమధ్య యాగశాలలోకి ప్రవేశించారు సీఎం కేసీఆర్ దంపతులు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలతో యాగశాల మార్మోగుతోంది. ఎర్రవల్లి శక్తి పీఠాన్ని తలపిస్తోంది. 40 ఎకరాల్లో జరుగుతోన్న మహా చండీయాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గవర్నర్ దంపతులు యాగశాలకు చేరకున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్వాగతం పలికారు. నిజామాబాద్ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత దంపతులు కార్యక్రమానికి వచ్చారు. వీవీఐపీలు, వీఐపీలు, వేలాది మంది భక్తులతో యాగశాల కళకళలాడుతోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy