అయ్యప్పస్వామి జన్మదిన వేడుల్లో అపశ్రుతి

attapaప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో ఈ రోజు జరిగిన అయ్యప్పస్వామి జన్మదిన వేడుల్లో అపశ్రుతి జరిగింది. స్వామి వారి జన్మదినోత్సవం సందర్భంగా ఆలయంలో అరట్టు ఉత్సవం నిర్వహించారు.  వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన  భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఉదయం ఊరేగింపు కొనసాగుతున్న సమయంలో అదుపుతప్పి పన్మన శరవణన్ అనే ఓ ఏనుగు పరుగులు తీయడంతో  ఆందోళనకు గురై భక్తులు పరుగులు తీయడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ  తొక్కిసలాటలో పలువురు భక్తులు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని పంబాలోని హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy