అయ్యో పాపం : ఘోరంగా ఓడిన నటుడు సాయికుమార్

Sai-Kumar-డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరో సారి ఓడిపోయాడు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఈ డైలాగ్‌ కింగ్‌కు తెలుగు సెంటిమెంట్‌ కలిసిరాలేదు.

కాంగ్రెస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందాడు. సీపీఎం, జేడీఎస్‌ అభ్యర్థులు రెండు, మూడు స్థానంలో నిలిచారు. సాయికుమార్ నాలుగో స్థానంలో నిలిచారు. కర్నాటక రాష్ట్రం మొత్తం బీజేపీ హవా నడిచినా.. సాయికుమార్‌ మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సాయికుమార్ చిత్తుగా ఓడిపోవటానికి ఆయన స్వయం కృతాపరాధమే అంటున్నారు. 2013 ఎన్నికల సమయంలో పోటీ చేసి.. ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. మళ్లీ 2008 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే తెరపైకి వచ్చారు. ఈసారి సాయికుమార్ కు కాకుండా మరో అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని బీజేపీ భావించింది. అయితే పట్టుబట్టి.. గొడవ చేసి చివరి నిమిషంలో బీజేపీ టికెట్ కన్ఫామ్ చేసింది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy