
చనిపోయిన భారతీయుల్లో ఎక్కువగా పంజాబ్ కు చెందిన వారు. హిమాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్ ప్రాంత వాసులు కూడా ఉన్నారన్నారు. ఆర్మీ జనరల్ వీకే సింగ్ ఇరాక్ వెళ్లి భారతీయుల మృతదేహాలను తీసుకొస్తారని తెలిపారు. ప్రత్యేక విమానం ఇండియా వచ్చిన తర్వాత.. అమృత్సర్, పాట్నా, కోల్‌కతా ప్రాంతాలకు పంపిస్తున్నామని తెలిపారు. ఇరాక్‌లో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల ఆత్మకు శాంతి చేకూరాలని రాజ్యసభలో రెండు నిమిషాల మౌనం పాటించారు. సుష్మా స్టేట్ మెంట్ కు ట్విట్టర్ లో స్పందించారు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.