అయ్య బాబోయ్: ఆలూ చిప్స్ టిన్ లలో పాములు

king-cobraకింగ్ కోబ్రా… అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. ఈ పాములు ఎక్కువగా భారత్, ఆగ్నేయాసియాలలో ఉంటాయి. దీన్ని పెంపుడు జీవిగా ఊహించగలరా..? విషపూరితం అంటున్నారు.. పెంపుడజీవి ఏంటీ అనుకుంటున్నారా..?  అవునండీ.. కాలిఫోర్నియాకు చెందిన ఓ ప్రబుద్ధుడు ఈ పామును పెంచుకుంటున్నాడు. ఈ నెల 25న ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి దగ్గర తనిఖీలు నిర్వహించగా ఊహించని విషయాలు బయటపడ్డాయి. అక్కడి పోలీసుల కథనం ప్రకారం… ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి నుంచి కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో పొటాటో చిప్ టిన్స్ కూడా ఉన్నాయి. వాటిని తెరిచి చూడగా.. మూడు కింగ్ కోబ్రాలు బయటపడ్డాయి. దీంతో షాక్ అయ్యారు. అతన్ని మరింత విచారించగా.. ఓ అడ్రస్ చెప్పాడు. అక్కడికి వెళ్లి చూడగా… మరింత ఆశ్చర్యపోయారు పోలీసులు. ఆ ఇంట్లో చిన్న సైజు జూనే ఉంది. మొసళ్లు, తాబేళ్లు, పాములు ఇలా రకరకాల జంతువులను పెంచుతున్నాడు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి వాటిని జంతు సంరక్షణ శాలకు తరలించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy