అరగంట ముందు వరకు టిక్కెట్ రిజర్వేషన్

train ticketప్రయాణికులకు రిజర్వేషన్ల ప్రక్రియ మరింత ఈజీ అయ్యేలా చేసింది రైల్వే శాఖ. ఇకపై 24 గంటల పాటు రిజర్వేషన్ కౌంటర్లు పనిచేసేలా చర్యలు చేపట్టింది. రిజర్వేషన్ చార్ట్స్ ఎక్కడైతే ముద్రిస్తారో ఆయా స్టేషన్లు 24*7 సర్వీస్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆన్ లైన్లో రైల్వే రిజర్వేషన్లు చేసుకున్న తర్వాత మిగిలిపోయే సీట్లను కూడా ఫిల్ చేసుకోవడంపై దృష్టిపెట్టింది రైల్వే శాఖ. కరెంట్ రిజర్వేషన్ల టికెట్లను అప్పటికప్పుడు కొనుకునేందుకు వీలుగా ఇకపై 24 గంటలపాటు రిజర్వేషన్లు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు.ఇప్పటి వరకు లేని విధంగా ఆన్ లైన్ ఫెసిలిటీ కల్పించనున్నారు. రైలు బయలుదేరడానికి అరగంట ముందు వరకు టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. స్టేషన్ కు రాకుండానే ఐఆర్ సీ టీసీ వెబ్ సైట్లో టికెట్ కొనుక్కోవచ్చు. కరెంట్ రిజర్వేషన్ ఇప్పటి వరకు పెద్ద పెద్ద స్టేషన్లలోనే అందుబాటులో ఉండేంది. ఇకపై చిన్న చిన్న స్టేషన్లలోనూ రిజర్వేషన్ టికెట్లు తీసుకునే వీలు కల్పిస్తోంది రైల్వే శాఖ.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy