అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా..BJP యువ మోర్చా హోమం

POOJA BJPఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మద్ధతు పలికిన నలుగురు సీఎంలకు హోమం చేశారు బీజేపీ యువ మోర్చా నేతలు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఇంట్లో దీక్ష చేస్తున్నారు కేజ్రీవాల్. వారం రోజులైనా కేంద్రం స్పందించకపోవడంతో… ఆయన దీక్ష కొనసాగుతోంది. కేజ్రీ దీక్ష దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఆదివారం (జూన్-17) నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, కర్నాటక సీఎం కుమారస్వామి మద్ధతు పలికారు. నీతి ఆయోగ్ సమావేశంలోనూ కేజ్రీ దీక్ష గురించి లేవనెత్తారు మమతా బెనర్జీ. కేజ్రీ దీక్ష పొలిటికల్ టర్న్ తీస్కోవడం.. కేజ్రీకి మైలేజ్ పెరగడంతో.. బీజేపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఓ వైపు సీనియర్ నేతలు కౌంటర్లేస్తుంటే.. యువనేతలు హోమాలు చేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా, అభివృద్ధి కోసం మోడీ ప్రయత్నిస్తుంటే… అంతా కుమ్మక్కై రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు బీజేవైఎం నేతలు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy