
మరోవైపు అరుణ్ జైట్లీపై అవినీతి ఆరోపణలు ఎక్కు పెట్టింది కేజ్రీవాల్ సర్కార్. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న టైంలో జైట్లీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తోంది. వెంటనే కేంద్ర మంత్రికి పదవికి జైట్లీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. డీడీసీఏ ఫైళ్లను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే తమపై కేంద్రం సీబీఐ దాడులకు ఉసిగొల్పిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.