అరుదైన తెల్లనాగు : శ్వేతనాగు అంటూ భక్తుల పూజలు

59801633అరుదైన తెల్లనాగు గిండిలోని చిల్డ్రన్స్‌ పార్కులో సందర్శకులకు ఆకర్షణగా నిలుస్తోంది. తిరువళ్లూరు జిల్లా పూండి అటవీప్రాంతంలో కనిపించిన ఈ  నాగును అటవీ సిబ్బంది చిల్డ్రన్స్‌ పార్కుకు చేర్చారు. శుక్రవారం(జూలై-28) ఈ నాగును చూసేందుకు సందర్శకులు ఉత్సాహం చూపుతున్నారని పార్కు నిర్వాహకులు తెలిపారు. పూర్తిగా తెల్లగా ఉన్న ఈ పాము శ్వేతనాగు అంటారని ఈ నాగు కళ్లు ఎర్రగా ఉంటాయని, అయితే ఈ సర్పం కళ్లు నలుపు రంగులో ఉన్నాయని చెప్పారు. శ్రీలంక, రాజస్థాన్ ప్రాంతాల్లో అరుదుగా కనిపించే తెల్లనాగు, పూండి అటవీ ప్రాంతాంలో దర్శనమివ్వడంతో ప్రజలు పామును చూడటానికి బారులు తీరారు. కొందరు శ్వేతనాగు అని పూజలు కూడా చేస్తున్నారట.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy