అర్చకుల జీతాలు పెంపు

POOJARULUఅర్చక, ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వారి వేతనాల చెల్లింపు సమస్యకు పరిష్కారం లభించింది. అర్చక, ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా సాలరీలు చెల్లింపుపై మంత్రు లు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ల సబ్‌ కమిటీ ఇటీవలే సీఎం కేసీఆర్‌కు నివేదికను అందజేసింది. పట్టణాల్లోని అర్చకులకు రూ.10వేలు, గ్రామాల్లోని అర్చకులకు రూ.8వేలు వేతనాలు చెల్లించాలని ప్రతిపాదిస్తూ సబ్‌కమిటీ నివేదిక రూపొందించింది. అర్చక, ఉద్యోగుల వేతనాలకు రూ.157 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ నిర్ణయం అమలైతే రాష్ట్రవ్యాప్తంగా 650 ఆలయాల అర్చక, ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.

సబ్‌కమిటీ నివేదికను పరిశీలించిన సీఎం కేసీఆర్‌ బుధవారం (సెప్టెంబర్13) ప్రగతిభవన్‌లో కేబినెట్‌ సబ్‌కమిటీ టీం, సలహాదా రు కేవీ రమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్‌ శివశంకర్‌తో సమీక్ష నిర్వహించారు. న్యాయపరంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్‌ వేతనాల చెల్లింపుపై అర్చక, ఉద్యోగుల సమక్షంలో శుక్రవారం (సెప్టెంబర్15) మధ్యాహ్నం ప్రకటన చేయనున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నవారిని రెగ్యులరైజ్‌ చేసే అంశంపైనా సీఎం కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మరికొన్ని ఆలయాల్లో నిత్య నిత్య ధూపదీప నైవేద్యాలను అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించే అవకాశం ఉంది.

ఈ క్రమంలో అన్ని జిల్లాల నుంచి అర్చక, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ప్రగతి భవన్‌కు భారీగా తరలి రావాలని తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ, అర్చక, ఉద్యోగుల జేఏసీ కన్వీనర్‌ గంగు భానుమూర్తి విజ్ఞప్తి చేశారు. కాగా ట్రెజరీ ద్వారా అర్చక, ఉద్యోగులకు వేతనాలను చెల్లించాలంటూ బుధవారం (సెప్టెంబర్13) కూడా ఆందోళనలు కొనసాగాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy