అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ ‘వర్మ’ ట్రైలర్ విడుదల

 విజయ్ దేవరకొండ హీరోగా.. సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి తెలుగులో ట్రెండ్ సెట్టర్ అయింది. ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో రిమేక్ చేస్తున్నారు. తమిళంలో ‘వర్మ’ గా రీమేక్ అవుతున్న ఈ సినిమాలో.. హీరో విక్రమ్ కొడుకు ధృవ్  మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు.  లేటెస్ట్ గా ‘వర్మ’ ట్రైలర్ విడుదల అయింది. ఈ సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్నాడు. టీజర్ లో కంటే.. ట్రైలర్ లో ధృవ్ ప్రామిసింగ్ గా కనిపించాడు.

అర్జున్ రెడ్డి హిందీలోనూ తెరకెక్కుతోంది.  హిందీ రీమేక్ ను దర్శకుడు సందీప్ వంగా తీస్తున్నాడు. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy