అర్థరాత్రి సినీ అలజడి : హీరో వరుణ్ భార్య ఆత్మహత్యాయత్నం అంటూ ప్రచారం

Vithika-Sheruటాలీవుడ్‌లో ఒకప్పుడు క్రేజీ హీరోగా వెలుగొందిన వరుణ్‌ సందేశ్‌కు సంబంధించిన వార్త ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వరుణ్‌ సందేశ్ భార్య, నటి వితిక ఆత్మహత్యకు ప్రయత్నించారని.. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వితిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లున్న ఫొటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్‌ అయ్యాయి. 2016 ఆగస్టులో వరుణ్‌-వితికల వివాహం జరిగింది. కొన్నాళ్లు అమెరికాలో ఉన్న దంపతులు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.

ఆత్మహత్యాయత్నం చేసినట్లు పెద్ద ఎత్తున అర్థరాత్రి అలజడి రేగటంతో.. స్వయంగా ఈ వార్తలను ఖండించింది వితిక. ‘అవన్నీ ఫేక్‌ న్యూస్‌. మేం సంతోషంగా ఉన్నాం. పుకార్లను నమ్మొద్దు’ అని ట్వీట్‌ చేసింది. అర్థరాత్రి 12గంటల సమయంలో హీరో వరుణ్ సందేశ్ కూడా ట్విట్టర్ ద్వారా ఈ వార్తలను ఖండించాడు. ‘పడ్డానండీ ప్రేమలో మరి’ అనే సినిమాలో వరుణ్‌-వితిక జంటగా నటించారు. అప్పుడు మొదలైన వీరి ప్రేమ.. కొన్నాళ్ల డేటింగ్‌ అనంతరం వివాహ బంధంగా మారింది. రాత్రి పడుకుని.. ఉదయం నిద్రలేచి వాట్సాప్, ఫేస్ బుక్ ఓపెన్ చేసిన వారికి ఈ వార్తలు షాక్ కు గురి చేశాయి. ఆత్మహత్యాయత్నం మాత్రమే హైలెట్ చేసిన కొన్ని వెబ్ సైట్లు.. ఖండించిన సమాచారాన్ని మాత్రం లైట్ తీసుకున్నాయి. దీంతో ఏది నిజం.. ఏది అబద్ధం అని తెలుసుకోవటానికి ఇబ్బంది పడ్డారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy