అర్పితకు రూ.16 కోట్ల ప్లాట్ గిఫ్ట్ ఇచ్చిన సల్మాన్

10810044_743908175657682_1165826993_n

అర్పిత-ఆయుష్ పెళ్లి ఫోటో

సల్మాన్ ఖాన్ చెల్లి పెళ్లి ముగిసింది. సెలబ్రెటీల మధ్య చాలా గ్రాండ్ గా అర్పిత, ఆయుష్ ల పెళ్లి తంతు ముగిసింది. ఒక్కొక్కరిగా సెలబ్రెటీలు ఎయిర్ పోర్ట్ నుంచి ఫలక్ నుమా ప్యాలెస్ కు వెళ్లి పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. పెళ్లి కూతురు అర్పితను ఆశీర్వదించారు.  హిందూ, ముస్లిం సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. వధువు తరఫున మతపెద్ద, పెళ్లికూతురు తరఫున పురోహితులు పెద్దలుగా ఉన్నారు. పెళ్లి వేడుకలకు కాజల్, కత్రినా, అమితాబ్, షారుఖ్ తో పాటు రాజకీయ, పారిశ్రామికవేత్తలు పెళ్లికి వచ్చారు. అమీర్ ఖాన్ కుటుంబ సమేతంగా పెళ్లికి వచ్చాడు.  సాయంత్రం 6 గంటలకు పెళ్లి జరగ్గా, 7 గంటలకు బరాత్ జరిగింది.

బరాత్ లో సల్మాన్ డ్యాన్సులతో సందడి చేశాడంట. సల్మాన్ తో పాటు మలైకా అరోరా ఖాన్ స్టెప్పులేశింది. చెల్లి పెళ్లి కోసం సల్మాన్ రూ.16 కోట్ల విలువైన ఫ్లాట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. రేపు గెస్ట్ లకు పార్టీ ఇవ్వనున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy