అలనాటి బాలీవుడ్ డైరెక్టర్ అనిల్ గంగూలీ కన్నుమూత

anil gangulyవెటరన్ బాలీవుడ్ డైరెక్టర్, రైటర్ అనిల్ గంగూలీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ మధ్యాహ్నం చివరిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. బాలీవుడ్ హిస్టరీలో 70ల నాటి నుంచి 90ల వరకు ఆయన ఎన్నో మరపురాని సినిమాలకు దర్శకత్వం వహించారు.  కోరాకాగజ్, తపస్య చిత్రాలకు ఆయనకు జాతీయ అవార్డులను అందించాయి. సాహెబ్, త్రిష్న, కాందాన్, హమ్ కాదమ్, ప్యార్ కే కబిల్, బలిదాన్ చిత్రాల్లో తనదైన ముద్రవేశారు. ఆయన కూతురు రూపాలీ గంగూలీ నటిగా, కుమారుడు విజయ్ గంగూలీ డ్యాన్స్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy