అలర్ట్: రేపు ఏపీలో జాతీయ రహదారుల దిగ్బంధం

ిేలదతప్రత్యేక హోదా కోసం రేపు ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారులను దిగ్బంధం చేయనున్నారు. ప్రత్యేక హోదా-విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జాతీయ రహదారులను దిగ్బంధం చేయనున్నారు.

ప్రత్యేక హోదా కోసం  రహదారుల దిగ్భంధానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు మంత్రి కళా వెంకట్రావు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు ఆందోళన చేసినా సహకరిస్తామన్నారు. విభజన హక్కుల సాధనే మా లక్ష్యమన్నారు. పదో తరగతి పరీక్షలకు, అత్యవసర సేవలకు ఇబ్బంది కలగకుండా సహకరించాలన్నారు.

జాతీయ రహదారుల దిగ్భంధనం కార్యక్రమానికి జనసేన మద్దతు ప్రకటించింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల దగ్గర నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ తెలిపింది. ఇప్పటికే ఆ కార్యక్రమానికి YCP తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy