అల్జీమర్స్ పేషెంట్లకు అడుగడుక్కీ ఆసరా!

Kenneth_Grandfatherఅల్జీమర్స్… ముసలితనంతో పాటు వచ్చే వ్యాధులలో ఒకటి. ఏమీ గుర్తుండదు. వితిన్ ది సెకండ్స్ అన్నింటినీ మర్చిపోతారు అల్జీమర్స్ బాధితులు. అలాంటి వారికి ఎక్కడికి వెళ్లారో.. ఏం చేశారో కూడా గుర్తుండదు. వాళ్లను నిమిషనిమిషానికి కనిపెట్టుకుని కూర్చోవాలి. అయితే ఇప్పటి నుంచి దీన్నుంచి ఈజీగా బయటపడొచ్చంటున్నాడు ఓ 16 ఏళ్ల అబ్బాయి. కెన్నెత్  షినోజుకా అనే ఈ అమెరికన్ అల్జీమర్స్ తో బాధపడే రోగులకు అండగా ఒక పరికరాన్ని కనిపెట్టాడు. వాళ్లు నిల్చుంటే అలారమ్ మోగేలా ఏర్పాటు చేశాడు. 60 శాతం మంది అల్జీమర్స్ బాధితులు ఎవరికీ చెప్పకుండా బయటకు వెళుతుంటారని అమెరికన్ అల్జీమర్స్ అసోషియేషన్ తెలిపింది. ఇలాంటి వారికి కెన్నెత్ కనిపెట్టిన పరికరం ఎంతగానో ఉపయోగపడనుంది. తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ పరికరాన్ని తయారు చేశాడు కెన్నెత్. రోగి తనంతట తాను బెడ్ మీద నుంచి నిలబడగానే కాళ్ల భాగంలో నరాల ఒత్తిడికి సెన్సార్ వైర్ లెస్ రూపంలో అలర్ట్స్ చేస్తుంది. ‘మా తాతయ్య అల్జీమర్స్ తో బాధపడుతున్నాడు. ఆయన కోసమే ఈ పరికరాన్ని తయారు చేశాను’ అని కెన్నెత్ చెప్పాడు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy