అల్లకల్లోలం : సముద్రం నుంచి ప్రచండ గాలులు – భీకర అలలు

costal-wavesప్రత్యేక వాతావరణ పరిస్థితులు దక్షిణాదిలోని తీర ప్రాంతాలను వణికిస్తున్నాయి. ప్రచండమైన గాలులతో  సముద్రం అలలు భారీ ఎత్తున ఎగసి పడనున్నాయి. 50 నుంచి 70 అడుగుల ముందుకు సముద్రం దూసుకూరానుంది. ఈ మేరకు సునామీ హెచ్చరికల సంస్థ ఇన్ కాయిస్ హెచ్చరించింది. ఏప్రిల్ 24, 25, 26తేదీల్లో మంగళ, బుధ, గురువారాలు ఈ మూడు రోజులు సముద్రం అల్లకల్లోలంగా ఉండనున్నట్లు వార్నింగ్స్ ఇచ్చింది. భారీగా అలలు ఎగసి పడుతాయని తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బంగాల్ తీర ప్రాంతాల్లోని సముద్రం ఇప్పటికే అల్లకల్లోలంగా మారిందని ఇన్ కాయిస్ తెలిపింది.

అండమాన్ వైపు నుంచి భారత తీరం వైపునకు ప్రచండ అలలు దూసుకువస్తున్నాయి. ఈ గాలుల వేగం గంటకు 100 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచానా వేస్తున్నారు. అదే విధంగా అలలు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు ఉండే అవకాశముందని స్పష్టం చేసింది. గాలులు తీరానికి దగ్గరగా వచ్చే సమయానికి అలల ఉధృతి మరింత ఉండనుంది. తీరప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు అలలు చొచ్చుకువచ్చే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది ఇన్ కాయిస్. తీరానికి దగ్గరగా నివసించే ప్రజలు.. సురక్షిత ప్రాంతాలకు వెళితేనే మంచిదని సూచించింది.

ఈ మూడు సముద్ర స్నానాలు చేయొద్దని.. ప్రజలను అప్రమత్తంగా చేయాలని జిల్లాల యంత్రాంగానికి హెచ్చరికలతో కూడిన సూచనలు ఇచ్చింది ఇన్ కాయిస్. మత్స్యకారులు వేటకు వెళ్లకుండని వార్నింగ్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ , మహారాష్ట్రపై ఈ అలల ఉద్ధృతి ఎక్కువ ప్రభావం చూపించే అవకాశముంది. ఆఫ్రికా సమీపంలో ప్రచండమైన గాలుల తీవ్రత కారణంగా సముద్రంలో భారీ అలలు ఏర్పడ్డాయని.. ఇప్పటికే అలలు పశ్చిమ తీరంలోని చాలా ప్రాంతాలను తాకాయని తెలిపింది. అరేబియా సముద్రంలోని ఆయా ప్రాంతాల్లో  నాలుగు నుంచి ఐదు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయని స్పష్టం చేసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy