అల్లరి నరేష్ అక్కగా కార్తీకా..?

Karthika-and-Allari-Nareshహీరోయిన్ కార్తీక ఇప్పుడు సిస్టర్ క్యారెక్టర్ చేస్తోంది. గతంలో టాలీవుడ్ లో దమ్ము మూవీ చేసినా.. టాలీవుడ్ లో అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఈ అమ్మడు తమిళ్ ఇండస్ట్రీలోనే సెటిల్ అయ్యింది. హీరోయిన్ గా ఛాన్స్ లు రావనుకుందో ఏమో మరి…అల్లరి నరేష్ నెక్ట్స్ మూవీలో సిస్టర్ క్యారెక్టర్ కు ఓకే చెప్పింది. వాడు వీడు డైరెక్టర్ చిన్నీకృష్ణ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక అల్లరి నరేష్ పక్కన హీరోయిన్ గా మోనల్ గజ్జర్ నటిస్తుంది. గతంలో వీరిద్దరు సుడిగాడు మూవీలో కలిసి నటించారు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కార్తీక క్యారెక్టర్ కీలకమని డైరెక్టర్ చెప్తున్నారు. నెగిటీవ్ క్యారెక్టర్ ను ఆమె లీడ్ చేస్తుందంటున్నారు డైరెక్టర్ చిన్ని కృష్ణ. అమ్మి రాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ లో అడుగుపెట్టింది కార్తీక.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy