అళగిరికి టిక్కెట్టివ్వని కరుణానిధి!

కన్న కొడుక్కి టిక్కెట్టివ్వలేదు డీఎంకే చీఫ్ కరుణానిధి. గొడవలన్నీ మరిచిపోయి మధురై నియోజకవర్గంనుంచి డీఎంకే కేండిడేట్ గా తన కొడుకు అళగిరిని కరుణానిధిని పోటీ చేయిస్తారని అనుకున్నవాళ్ళకి ఈవేళ్టి డిసిషన్ షాకిచ్చింది. కొంతకాలంగా అళగిరికీ, కరుణానిధికీ పడడంలేదు. చిన్న కొడుకు స్టాలిన్ ను తన వారసుడిగా కరుణానిధి ప్రకటించినప్పటినుంచి అళగిరి చాలా కోపంగా ఉన్నారు. ‘కొన్ని నెలల్లో చచ్చేవాడికి పదవులేమిటి?’ అని స్టాలిన్ గురించి అళగిరి కామెంట్ చేయడంతో కరుణానిధి చాలా బాధపడ్డారు. అప్పటినుంచి అళగిరిని పక్కనపెట్టేశారు. లోక్ సభకు పోటీ చేసే డీఎంకే కేండిడేట్లను ఈవేళ ప్రకటించిన కరుణానిధి మధురై  సీటుకు వేరే కేండిడేట్ ను ప్రకటించడంతో తండ్రీకొడుకుల వార్ మరింత ఓపెన్ గా మారింది. ఒక విలేఖరి అళగిరి గురించి అడిగితే, ‘అతని పేరెత్తి నన్ను బాధపెట్టకండి’ అని అనేశారు కరుణానిధి. టెలికమ్ స్కామ్ లో చిక్కుకున్న దయానిధి మారన్ కు, ఏ రాజాకు ఈసారి మళ్ళీ టిక్కెట్లిచ్చారు కరుణానిధి. ఇది కూడా షాకే కదా!

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy