అవాక్కయ్యారా : ఉప్పుకి బిల్లు వేసిన రెస్టారెంట్

salt-chargesఉప్పు పన్ను వేశారని చరిత్రలో చదువుకున్నాం.. ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహంతో స్వాతంత్ర్య ఉద్యమమే నడిచింది.. ఇప్పుడు ఉప్పు వ్యాపారం అయ్యింది. ఇక్కడ వరకు ఓకే.. వంటకు గ్యాస్, పప్పులు ఎంత ముఖ్యమో ఉప్పు అంతకంటే ముఖ్యం. ఉప్పు లేని కూర, పప్పును ఊహించుకోలేం. బీపీ ఉందని తగ్గించినా.. కొంచెం అయినా వేసుకుంటాం. ఇది కామన్. అయితే హోటల్ కు వెళ్లిన ఓ ఫ్యామిలీకి షాక్ ఇచ్చింది హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్. భోజనం తర్వాత లైమ్ సోడా ఆర్డర్ చేశారు. అది రుచి చూసిన కస్టమర్.. ఉప్పు తక్కువగా ఉందని చెప్పాడు. వెయిటర్ ఓ చిన్న గిన్నెలో ఉప్పు తెచ్చి ఇచ్చారు. చక్కగా కలుపుకుని తాగేశాడు ఆ కస్టమర్. తర్వాత బిల్లు చూసి అవాక్కయ్యాడు. ఉప్పుకి కూడా చార్జ్ చేశారు. ఉప్పుకి రూపాయి బిల్లు పడింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఆధారంగా దేశంలో ఇదే ఫస్ట్ టైం అంటున్నారు నెటిజన్స్.

దీనిపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే ఉప్పు అదనంగా ఇచ్చాం కాబట్టి చార్జ్ వేస్తాం అన్నారు. దీంతో ఆ కస్టమర్.. విషయాన్ని లీగల్ డిపార్ట్‌‌మెంట్ దృష్టికి తీసుకువెళ్లాడు. సాల్ట్‌ను ప్యాకెట్‌లో కాకుండా విడిగా సర్వ్ చేశారని.. దీంతో ఆ హోటల్ పై చర్య తీసుకోలేమని చేతులెత్తేశారు. ఉప్పుకి బిల్లు అంశం ప్యాకేజీ గూడ్స్ అండ్ కమోడిటీస్ చట్టం కిందికి రాదన్నారు. ఓవర్‌ చార్జ్ చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చే హోటళ్ళు, రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటాం కానీ.. ప్రత్యేకంగా సర్వ్ చేసిన ఉప్పు విషయంలో ఏమీ చేయలేమని స్పష్టం చేసింది లీగల్ డిపార్ట్ మెంట్. దీంతో కస్టమర్ చేసేది ఏమీలేక చెప్పింది విని వచ్చేశారు.

దీనిపై హోటల్ యాజమాన్యం స్పందించింది. ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని ఊహించలేదని.. పొరపాటు జరిగిందని అంగీకరించింది. బిల్లింగ్ సెక్షన్ లోపం వల్లే ఉప్పుకు ఛార్జ్ చేశామని వివరణ ఇచ్చింది. GST వచ్చిన తర్వాత కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేశామని.. దీని ద్వారా ఈ సమస్య తలెత్తి ఉండొచ్చని చెప్పుకొచ్చింది. కస్టమర్ లైమ్ సోడా ఖరీదు 150 రూపాయలు తిరిగి ఇచ్చేందుకు అంగీకరించింది. దీనికి కస్టమర్ తిరస్కరించారు. అదనంగా ఇచ్చిన ఉప్పుకు బిల్లు వేయటాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నానని.. సోడా డబ్బు కోసం కాదని చెప్పాడు. మొత్తంగా అదనంగా అడిగిన ఉప్పుకు రూపాయి బిల్లు ఎంత పని చేసిందంటూ హోటల్ యాజమాన్యం తల పట్టుకుంటోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy