అవార్డు తిరిగిచ్చేసిన నెహ్రూగారి మేనకోడలు

04_SM_NAYANTARA_1_2266929fబీఫ్ కాంట్రవర్సీతో కార్నర్ అయిన మోడీ సర్కారుకు మరో షాకింగ్ న్యూస్. దాద్రి ఘటనపై  ఎంతోమంది డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా మోడీ ప్రభుత్వంపై అటాక్ చేస్తున్నారు. లెటెస్ట్ గా ఓ పేరున్న రచయిత తనకొచ్చిన అత్యున్నత సాహితీ పురస్కారాన్ని కేంద్రానికి తిరిగిచ్చేసి నిరసన తెలిపారు. అంతేకాదు పీఎం  మోడీ టార్గెట్ గా విమర్శలకు దిగారు.

నయన్ తారా సెహగల్. దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు. నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్ రెండో కూతురు. గాంధీ-నెహ్రూల వారసత్వ గుర్తింపు కన్నా… ఓ రచయితగా… డైనమిక్ పర్సనాలిటీగా ఆమెకున్న ఐడెంటిటీ అంతా ఇంతా కాదు..

నయన్ తార సెహగల్ ఇపుడో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాహితీ రంగంలో తనకొచ్చిన అత్యున్నత పురస్కారం…. సాహితీ అకాడమీ అవార్డ్ ని కేంద్రానికి తిప్పి పంపారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్నికైనప్పటినుంచి దేశంలో డెమోక్రసీకి తూట్లు పొడుస్తున్నారన్నది ఆమె ఆరోపణ. సాంస్కృతిక వైవిధ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారామె. రీసెంట్ గా దాద్రి ఘటన…. అంతకుముందు ఎంఎం కాల్ బుర్గీ(MM Kalburgi), నరేంద్ర దబోల్కర్(Narendra Dabholkar), గోవింద్ పన్సారే(Govind Pansare) వంటి హేతువాదుల హత్యలు… సెహగల్ ని తీవ్రంగా కలిచి వేశాయి. అంతేకాదు హిందుత్వ ముసుగులో కొన్ని సంస్థలు చేస్తున్న అరాచకాలతో… అంతర్జాతీయంగా దేశం పరువు మంటగలుస్తోందన్నది ఆమె ఆగ్రహం. ఇంత జరుగుతున్నా మోడీ సైలెంట్ గా ఉండటం దారుణం అన్నారామె. అందుకే ఎన్డీఏ తీరుకు నిరసనగా తనకొచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కిస్తున్నట్లు ప్రకటించారామె….BITE ( నయన్ తార సెహగల్, కేంద్ర సాహితీ అకాడమీ అవార్డ్ గ్రహీత )

గతంలో చాలాసార్లు మోదీపై విమర్శలు చేసిన నయనతార.. ఇపుడు ఏకంగా అత్యున్నత పురస్కారాన్ని వెనక్కి పంపడం… సాహితీ లోకంతోపాటు…. రాజకీయ రంగంలోనూ హాట్ టాపిక్ అయింది. 1927లో పుట్టిన నయనతార.. దేశంలో పేరున్న ఇంగ్లీష్ రైటర్స్ లో ఒకరిగా ఎదిగారు. రాజకీయ మార్పులు… వాటితోపాటే దేశంలో వస్తున్న మార్పుల ఆధారంగా…. ఆమె రాసిన పుస్తకాలెన్నో పాపులర్ అయ్యాయి. ఆమె రాసిన రిచ్ లైక్ అజ్ నవలకు 1986లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇప్పుడు దాన్నే తిప్పి పంపారామె. అంతేకాదు 1975-77 మధ్య ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వ్యక్తుల్లో సెహగల్ ఒకరు. నాటి ప్రధాని ఇందిరతో బంధుత్వం ఉన్నా… ప్రజాస్వామ్యానికి చీకటి రోజులను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఇపుడు ప్రధాని మోడీని టార్గెట్ చేశారు నయనతార సెహగల్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy