అవిశ్వాసంపై చర్చ : పార్టీలకు సమయం కేటాయింపు

ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం (జూలై-20) చర్చకు రానుంది. లోక్‌ సభలో టీడీపీ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానంపై చర్చ కోసం పార్టీలకు సమయం కేటాయించారు. అధికార బీజేపీకి 3 గంటల 33 నిమిషాల సమయం కేటాయించగా.. కాంగ్రెస్‌ కు 38 నిమిషాలు, అన్నాడీఎంకే పార్టీకి 29, తృణమూల్ కాంగ్రెస్‌ కు 27, బీజేడీకి 15, శివసేనకు 14, టీడీపీకి 13, టీఆర్‌ఎస్‌కు 9 నిమిషాల సమయాన్ని కేటాయించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy