అవిసెలతో మధుమేహంకు చెక్…

అవిసె గింజ‌లను నిత్యం మ‌న ఆహారంలో తీసుకుంటే దాంతో బోలెడు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా అవిసె పొడిని రెగ్యులర్ గా వాడితే మధుమేహం అదుపులో ఉంటుంది.

* ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ అవిసె గింజలలో పుష్క‌లంగా ఉంటాయి. చేప‌ల వంటి మాంసాహారం త‌రువాత ఆ యాసిడ్లు అధికంగా ల‌భించే ఆహారాల్లో అవిసెలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో పీచు పదార్థం(ఫైబ‌ర్‌) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తికి మంచిది. మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. ఈ గింజల్ని మెత్తగా పొడిచేసి చపాతీ పిండి, దోశ‌ పిండి, ఇడ్లీ పిండిలో కలుపుకొని వాడ‌వ‌చ్చు.

* అవిసె గింజ‌లలో కొలెస్ట్రాల్‌ తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో వేడిని పుట్టిస్తాయి. ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి. వీటిని ప్రతి రోజు ఉదయం పూట తీసుకుంటే అలసట నుంచి ఉపశమనం పొందవచ్చు.

* మహిళల్లో హార్మోన్ల‌ను సమతుల్యం చేస్తాయి. రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యానికే కాక అందానికి కూడా ఇవి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జుట్టుని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతాయి. యాంటీ ఏజింగ్ ల‌క్షణాలు అవిసెల్లో పుష్క‌లంగా ఉంటాయి.

* అవిసె నూనె వాడితే ప్రొస్టేట్‌, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లనుంచి రక్షణ పొందవచ్చు. మెనోపాజ్‌ మహిళల్లో వేడి ఆవిర్లు తగ్గుముఖం పడతాయి. రేడియేషన్‌ ప్రభావానికి గురికాకుండా చర్మానికి రక్షణ అందిస్తుంది.

* అవిసె గింజలు మెదడుకు శక్తిని పెంచే ఆహారం. వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు ఎమర్జెన్సీగా పనిచేసి డిప్రెష‌న్‌ను కూడా సమర్ధవంతంగా నివారించగలుగుతాయి. ఆస్తమా, ఎలర్జీల నుండి ఉపశమనం అవిసె నూనె వలన లబిస్తుంది.

* చుండ్రు సమస్యను సమర్ధవంతంగా నివారించి, పేలు నశించేట్లు చేయడంలో అవిసె నూనెను మించింది లేదు. వెంట్రుకలు కూడా మళ్ళీ పెరిగి జుట్టు చిక్కగా తయారవుతుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy