అవును వాళ్లిద్దరూ కలుస్తున్నారు : ట్రంప్ – కిమ్ భేటీకి డేట్ ఫిక్స్

Tump-Kim

అమెరికా, ఉత్తరకొరియా అధ్యక్షుల భేటీకి రెడీ అవుతోంది. జూన్ 12వ తేదీ సింగపూర్ లో సమావేశం కానున్నట్లు ట్వీట్ చేశారు ట్రంప్. ప్రపంచ శాంతి కోసం తాము కలసి పని చేస్తామన్నారు. వింటర్ ఒలింపిక్స్ తర్వాత అమెరికా, నార్త్ కొరియా మధ్య పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఈ మధ్యే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ ట్రంప్ తో సమావేశం అయ్యారు. తర్వాతే ట్రంప్ – కిమ్ భేటీపై క్లారిటీ వచ్చింది. అటు అమెరికా.. ఇటు ఉత్తరకొరియాలో కాకుండా.. మధ్యలో సింగపూర్ లో భేటీ కావాలని నిర్ణయించారు.

కిమ్ జాంగ్ ఉన్, ట్రంప్ సమావేశ తేదీ, వేదిక ఫిక్స్ కావడానికి ముందు.. చాలా ప్రాసెస్ జరిగింది. ఈ రెండు దేశాల నేతలను ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్. దక్షిణకొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్ లో… ఉత్తర కొరియా ప్లేయర్స్ పాల్గొనప్పటి నుంచి అమెరికా, నార్త్ కొరియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లబడుతూ వచ్చాయి. దక్షిణ, ఉత్తర కొరియా అధ్యక్షులు.. మూన్ జె ఇన్.. కిమ్ జాంగ్ ఉన్ సమావేశంతో శాంతికి అవకాశం ఏర్పడింది.

రెండు నెలల క్రితం వరకు కిమ్.. ట్రంప్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగింది. క్షిపణి ప్రయోగాలు, అణ్వస్త్ర పరీక్షలతో అమెరికాను భయపెట్టే ప్రయత్నం చేశారు కిమ్ జాంగ్ ఉన్. ఖండాంతర క్షిపణులతో హవాయ్ ద్వీపంపై దాడి చేస్తామని కూడా హెచ్చరించారు. ఇటు ట్రంప్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ కావడంతో రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చైనా, దక్షిణకొరియా దేశాల జోక్యంతో వెనక్కి తగ్గారు కిమ్. మరోవైపు ఉత్తరకొరియా తమ ఆధీనంలో ఉన్న ముగ్గురు అమెరికన్లను విడుదల చేసింది. వాషింగ్టన్ ఎయిర్ బేస్ కు వచ్చిన వీరిని.. ప్రెసిడెంట్ ట్రంప్ స్వయంగా స్వాగతించారు. రెండు దేశాల మధ్య సదస్సు జరిగే ముందు కిమ్ అమెరికన్లను విడుదల చేయడం చాలా సంతోషకరమైన విషయమన్నారు ట్రంప్. దక్షిణకొరియాకు చెందిన ఈ మూడు కుటుంబాలు 60 ఏళ్ల క్రితం అమెరికాలో స్థిరపడ్డాయి. 2016, 2017 లలో ఉత్తరకొరియా వెళ్లిన వీరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే జూన్ మొదటి వారంలో కిమ్, ట్రంప్ సమావేశం జరుగుతుండడంతో.. స్నేహపూర్వకంగా కిమ్ ఈ ముగ్గురు అమెరికన్లను విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy