అవే ఎండలు.. అవే మంటలు

summerరాష్ట్రంలో ఎండలు అంతకంతకు భయపెడుతున్నాయి. బయట కాలు పెట్టలేని విధంగా వడగాల్పులు. మండే ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. గురువారం (మే 18) కూడా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. పెరిగిన ఎండలు, వడగాలులతో  జనం అల్లాడిపోతున్నారు.  మధ్యాహ్నం అయితే చాలు భయపడిపోతున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. బయటకు వెళ్లిన జనాలు.. జ్యూస్ లు, కొబ్బరి బొండాలు తాగుతూ గొంతు తడుపుకుంటున్నారు. అత్యవసర పనులుంటేనే బయటకు వెళ్లాలంటున్నారు డాక్టర్లు. బయటకు పోయేటప్పుడు జాగ్రతలు తీసుకోవాలంటున్నారు.

గురువారం పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల్లో 44 డిగ్రీలు నమోదయ్యింది. ఆదిలాబాద్, అసిఫాబాద్ జిల్లాలో 43 డిగ్రీలు, జనగాం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్ జిల్లాల్లో 42 డిగ్రీలు నమోదైంది. జగిత్యాల, నల్లగొండ, నిజామాబాద్, సిద్ధిపేట, వరంగల్ లో 41 డిగ్రీలు, నిజామాబాద్, యాదాద్రి భువనగిరిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy