అవ‌మాన భార‌తం: ఇన్న‌ర్‌వేర్ తీసేసి ప‌రీక్షకు రావాలన్నారు

ineerదేశం సాంకేతికంగా ముందుకు వెళుతున్నా ఇక్క‌డి మ‌నుషుల ఆలోచ‌నా విధానంలో మాత్రం మార్పు రావ‌డం లేదు. కేర‌ళ‌లో ఇలాంటి మ‌నుషులే నీట్ ప‌రీక్ష సంద‌ర్భంగా ద‌ర్శ‌న‌మిచ్చారు. కేర‌ళ‌లో నీట్ ప‌రీక్ష రాసేందుకు వ‌చ్చిన అమ్మాయిల‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. ప‌రీక్ష రాసేందుకు హాల్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గానే అక్క‌డి అధికారులు అమ్మాయిల ఇన్న‌ర్‌వేర్ తీసేసి ప‌రీక్ష హాల్‌లోకి రావాల‌ని ఆదేశించారు. చేసేదేమీ లేక విద్యార్థినులు వారి ఇన్న‌ర్‌వేర్స్ వ‌దిలి ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు.

ప‌రీక్ష రాసేందుకు వెళ్లిన త‌మ బిడ్డ కొద్ది క్ష‌ణాల‌కే బ‌య‌ట‌కు రావ‌డంతో ఆందోళ‌న చెందిన‌ట్లు ఓ త‌ల్లి ఆవేద‌న వ్య‌క్తం చేసింది. బ‌య‌టికొచ్చింది లోదుస్తులు ఇవ్వ‌డానికే అని తెలుసుకున్న ఆ త‌ల్లి క‌న్నీరుమున్నీరైంది. మ‌రో తండ్రికి కూడా ఇలాంటి చేదు అనుభ‌వ‌మే ఎదురైంది. జీన్స్ ప్యాంట్ ధ‌రించ‌డంతో అధికారులు ప‌రీక్ష హాల్లోకి రానివ్వ‌లేదు. దీంతో ఆ విద్యార్థిని తండ్రి మూడు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఓ బ‌ట్ట‌ల దుకాణంకు వెళ్లి కొత్త డ్రెస్ కొని తీసుకొచ్చాడు. ఇక ముస్లిం సామాజిక వ‌ర్గానికి చెందిన విద్యార్థుల ప‌రిస్థితి మ‌రింత దారుణంగా క‌నిపించింది.

ఈ వార్త సోష‌ల్ మీడియాకు ఎక్క‌డంతో మ‌నుషులా మృగాళ్లా అంటూ నెటిజెన్లు దుమ్మెత్తి పోశారు. ఆ స్థానంలో  అధికారుల కూతురు ఉండి ఉంటే ప‌రిస్థితి ఎలా ఉండేదో ఒక్క‌సారి ఊహించండి అంటూ కామెంట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌తో దేశం కొన్ని ద‌శాబ్దాల వెన‌క్కి వెళ్లిన‌ట్లయ్యింద‌ని ఇంకొంద‌రు వ్యాఖ్యానించారు.

కేర‌ళ‌లో విద్యార్థుల‌కు జ‌రిగిన అవ‌మానంపై సీఎం పిన‌రాయి విజ‌య‌న్ అధికారుల‌ను గుర్తించి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ రాష్ట్ర మ‌హిళా కాంగ్రెస్ నేత బిందు కృష్ణ డిమాండ్ చేశారు.

2 Responses to అవ‌మాన భార‌తం: ఇన్న‌ర్‌వేర్ తీసేసి ప‌రీక్షకు రావాలన్నారు

  1. Raviteja says:

    Andhuke Mr. .venkayya naidu cheppinattu World motham bharath vaipu choosthundhi (vekiliga).
    Invisilators em chestharu gurrupetti nidrapothara??.idhi mana developing india.

  2. Pavan says:

    Prabhuthavam a entha varaku a charge tisukola a govt ki teliyadha ala jarigindhi ani exam….? Alanti vala meda charge tisuko vali ani taliyada? Amaelani kapadandi ani chepatam kadhu kapadataniki manam ami chesthunam adhi alo chinchandi…….. E news only India ne kadhu total world chusthadhi daya chesi India paruvu tiyavadhu…..

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy